📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

H1B Visa: హెచ్-1బీ జాబ్స్ భర్తీలో బ్యాంకింగ్.. వెనుకంజలో టెక్ కంపెనీలు

Author Icon By Vanipushpa
Updated: June 30, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెచ్ – 1బీ వీసాల(H-1B) జారీ అనగానే అమెరికన్ టెక్ కంపెనీలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆ వీసాల ద్వారా ఏటా భారీగా రిక్రూట్‌మెంట్‌లు చేసుకునేది సిలికాన్ వ్యాలీ(silicon valley) దిగ్గజ సంస్థలే. 2020 మే నుంచి 2024 మే మధ్యకాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హెచ్ – 1బీ వీసా ఉద్యోగుల భర్తీలో అమెరికా టెక్ కంపెనీ(america Tech Company)లను బ్యాంకింగ్, టెలికాం రంగ సంస్థలు దాటేశాయి. సిటీ గ్రూప్(City Group), క్యాపిటల్ వన్(Capital One), ఏటీ అండ్ టీ, వాల్‌మార్ట్, యూఎస్ఏఏ, వేరిజాన్ లాంటి కంపెనీలు హెచ్-1బీ వీసాలతో దూకుడుగా నిపుణులను భర్తీ చేసుకున్నాయి. దీంతో ఉద్యోగాల భర్తీలో సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ టెక్ కంపెనీలు వెనుకంజలో ఉండిపోయాయి. ఈమేరకు వివరాలతో అమెరికా ప్రభుత్వం ప్రచురించిన సమాచారాన్ని విశ్లేషించి బ్లూమ్‌బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది.

కాంట్రాక్టు సంస్థల ద్వారా భర్తీ జరిగిందా?
అసలు హెచ్-1బీ వీసా వ్యవస్థను అమెరికా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందే టెక్ దిగ్గజ కంపెనీల కోసం. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా వివిధ దేశాల్లోని టెక్ నిపుణులకు అమెరికా కంపెనీలు రెడ్ కార్పెట్ పరిచేందుకు ఊతమివ్వడమే ఈ వీసా వ్యవస్థ లక్ష్యం. ఈ వీసాలను వినియోగించుకునే విషయంలో టెక్ కంపెనీలను టెలికాం, బ్యాంకింగ్ కంపెనీలు దాటేశాయి. 2020 మే నుంచి 2024 మే మధ్యకాలంలో బ్యాంకింగ్ సేవల సంస్థ సిటీ గ్రూప్ 3వేల మందికిపైగా హెచ్-1బీ వర్కర్లను రిక్రూట్ చేసుకుంది. ఆ నాలుగేళ్లలో ఎన్ విడియా, ఒరాకిల్, క్వాల్ కామ్‌ల కంటే సిటీ గ్రూపే ఎక్కువగా హెచ్-1బీ రిక్రూట్‌మెంట్లు చేసుకోవడం గమనార్హం. కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగుల్లో చాలామందిని సిటీ గ్రూప్ నేరుగా రిక్రూట్ చేసుకోలేదని, కాంట్రాక్టు సంస్థల ద్వారా భర్తీ చేసుకుందని అధ్యయన నివేదికలో ప్రస్తావించారు.

H1B Visa: హెచ్-1బీ జాబ్స్ భర్తీలో బ్యాంకింగ్, వెనుకంజలో టెక్ దిగ్గజాలు

హెచ్-1బీ వీసా లాటరీ వ్యవస్థలో గోల్‌మాల్
తాజా నివేదిక ప్రకారం, పలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఒకే ఉద్యోగి కోసం వేర్వేరు కంపెనీల తరఫున హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్లను దాఖలు చేయిస్తున్నాయి. తద్వారా అవి హెచ్-1బీ వీసా లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన క్యాపిటల్ వన్ కంపెనీ 429 వేర్వేరు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా హెచ్-1బీ వర్కర్లను భర్తీ చేసుకుంది. వీటిలో 361 రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు అభ్యర్థుల తరఫున ఒకటికి మించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈవిధంగా ఉద్యోగుల భర్తీ చేసుకున్న ఇతర కంపెనీల్లో వేరిజాన్, వాల్‌మార్ట్, ఏటీ అండ్ టీ, యూఎస్ఏఏ వంటివి ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్లే ఆయా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఏటా పెద్దసంఖ్యలో హెచ్-1బీ వీసాలను సాధిస్తున్నాయని 2023లో అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన నివేదికలో ఉంది.

అర్హతలు, అనుభవమున్నా వేతనం తక్కువే
నేరుగా అమెరికా కంపెనీలు భర్తీ చేసుకుంటున్న హెచ్-1బీ వర్కర్లతో పోలిస్తే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగం పొందుతున్న వారికి తక్కువ శాలరీ వస్తోందని నివేదిక తెలిపింది. నేరుగా అమెరికాలోని ఐటీ కంపెనీల్లో రిక్రూట్ అయిన హెచ్-1బీ వర్కర్లకు ఏటా రూ.1.21 కోట్ల వేతన ప్యాకేజీ అందుతుండగా, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ఐటీ జాబ్ పొందిన వారికి రూ.80 లక్షల వార్షిక వేతనమే లభిస్తోందని పేర్కొంది. ఉద్యోగ హోదా, విద్యార్హతలు, అనుభవం ఉన్నా థర్డ్ పార్టీ మార్గంలో భర్తీ అయినందున ఎంతోమంది ఐటీ నిపుణులు వేతనంలో వెనుకబడిపోతున్నారని నివేదిక వెల్లడించింది. “మా కంపెనీపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగ భర్తీలో వివక్ష చూపడం అనేది చట్ట వ్యతిరేకం. అలాంటి కార్యకలాపాలకు టీసీఎస్ అస్సలు పాల్పడదు.

అధికారిక సమాచారం అందాక స్పందిస్తాం : క్యాపిటల్ వన్
“మా కంపెనీ కోసం ఉద్యోగాలను భర్తీ చేసిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై ప్రభుత్వం వీసా మోసం అభియోగాలను మోపిందనే సమాచారం ఇంకా అధికారికంగా అందలేదు. ఆ సమాచారం అందిన తర్వాత, తగిన విధంగా స్పందిస్తాం. చట్టపరంగా ప్రొసీడ్ అవుతాం. మా కంపెనీ చట్టానికి కట్టుబడి నడుచుకుంటుంది” అని క్యాపిటల్ వన్ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.
“ఉద్యోగ కాంట్రాక్టుల్లో చాలా క్లిష్టమైన నిబంధనలు ఉంటాయి. వాటి వల్ల రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టతరంగా మారుతుంది. హెచ్-1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు పొందినవారు వేతనాలు, ఉద్యోగాల మార్పు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించరు. ఎందుకంటే వారి వీసా స్టేటస్ అనేది రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతోనే ముడిపడి ఉంటుంది.

Read Also: mining accident : సుడాన్ లో కుప్పకూలిన బంగారు గని… 11 మంది మృతి

#telugu News Ap News in Telugu banking leads H1B hiring banking sector H1B approvals Breaking News in Telugu Google News in Telugu H1B for Indians H1B job sponsorship H1B visa 2025 H1B visa jobs H1B visa layoffs tech industry H1B visa news today H1B visa statistics 2025 H1B visa trends IT companies H1B visa status Latest News in Telugu Paper Telugu News tech companies H1B slowdown tech giants job cuts Telugu News online Telugu News Paper Telugu News Today US work visa updates USA job market H1B

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.