📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Gukesh: కార్ల్‌సన్‌ను ఓడించిన గుకేశ్‌

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ సంచలన విజయం సాధించాడు. క్లాసికల్‌ చెస్‌ పోటీలో ప్రపంచ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌(Magnus Carlsen)ను ఓడించాడు. ప్రపంచ మేటి ఆటగాడిని ఓడించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. తన కెరీర్‌లో క్లాసికల్‌ చెస్‌ పోటీలో కార్ల్‌సన్‌ను ఓడించడం గుకేశ్‌కు ఇదే తొలిసారి. ఈ పోటీలో తొలి రౌండ్‌లో కార్ల్‌సన్‌ చేతిలో గుకేశ్ ఓటమి పాలయ్యాడు. కానీ, ఆ తర్వాత రివేంజ్ తీర్చుకున్నాడు. గుకేశ్ చేతిలో ఓటమి పాలైన తర్వాత కార్ల్‌సన్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నార్వే చెస్‌ టోర్నీలో భాగంగా ఆరో రౌండ్‌(6th round)లో తెల్లపావులతో బరిలోకి దిగాడు దొమ్మరాజు గుకేశ్‌(Gukesh). తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా వ్యూహాలు రచించాడు. తనదైన మార్క్ గేమ్‌తో ప్రపంచ నంబర్‌ వన్‌కు షాక్ ఇచ్చాడు. కార్ల్‌సన్‌ చేసిన తప్పిదాన్ని ఒడిసిపట్టుకున్న ప్రపంచ నంబర్‌ 3 గుకేశ్‌ అద్భుతం చేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోటీలో కార్ల్‌సన్‌ చాలా సేపు గుకేశ్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. 

ప్రయ‌త్నం

నార్వే గ్రాండ్‌మాస్టర్‌పై క్లాసిక‌ల్ గేమ్‌లో గుకేశ్ గెల‌వ‌డం ఇదే మొద‌టిసారి కావడం విశేషం. ఇక కార్ల్‌స‌న్‌పై విజ‌యం సాధించిన రెండో భార‌తీయ ప్లేయ‌ర్‌గా 19 ఏళ్ల గుకేశ్ నిలిచాడు. అంతకుముందు ప్రజ్ఞానంద(Pragnanda) చేతిలో కార్ల్‌సన్‌ ఓట‌మి చ‌విచూశాడు.గుకేశ్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడు కార్ల్‌సన్‌. ఓడిపోయానని అర్థం అయ్యాక పిడికిలితో ఒక్కసారిగా చెస్‌ బోర్డు టేబుల్‌ను గట్టిగా కొట్టాడు. దీంతో చెస్ వుడెన్ పీస్‌లు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. కాసేపటికే తేరుకున్న కార్లస‌న్ మ‌ళ్లీ టేబుల్‌పై పావుల‌ను అమ‌ర్చే ప్రయ‌త్నం చేశాడు. ఆ తర్వాత గుకేశ్‌కు సారీ చెప్పి చకచకా నడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతోంది.ఓటమి తర్వాత కార్ల్‌సన్ అసహనం ప్రదర్శించినా, గుకేశ్ ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా సహనం ప్రదర్శించిన తీరు క్రీడా ప్రపంచం చేత జేజేలు పలికిస్తోంది. 

Read Also: IPL Final: ఐపీఎల్ ఫైనల్.. ఈసారి క‌ప్ మ‌న‌దే: డీకే శివ‌కుమార్‌

#ChessShock #GukeshD #IndianGrandmaster #MagnusCarlsen #NorwayChess2025 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.