Grand Slam Tournament: మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన అల్కరాజ్

Read Time:  1 min
Grand Slam Tournament: మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన అల్కరాజ్
FONT SIZE
GET APP

ప్రపంచ టెన్నిస్ అభిమానులను తన ఆటతో మంత్ర ముగ్ధులను చేస్తున్న స్పెయిన్ యువ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ(Grand Slam Tournament)లో అదరగొడుతున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో అల్కరాజ్ ఫాబియన్‌ మరోజాన్‌ (హంగరీ)పై గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు.రెండు గంటల పాటు సాగిన పోరులో అల్కరాజ్‌ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడు.తొలి సెట్లో 6-1తో విజయం సాధిస్తూ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్లో మాత్రం మరోజాన్ నుంచి పోటీ ఎదురైనప్పటికీ, మిగిలిన రెండు సెట్లలో మాత్రం అల్కరాజ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఫాబియన్‌ను వెనక్కి నెట్టి విజయం సాధించాడు.

Grand Slam Tournament: మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లిన అల్కరాజ్
Grand Slam Tournament:

పట్టుదలతో

కేవలం 21 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ టెన్నిస్ రంగంలో అల్కరాజ్ అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. మ్యాచ్‌లో ప్రత్యర్థి ఎంత కసిగా ఆడినా, అల్కరాజ్ తన శారీరక ధృడత్వంతో పాటు మానసిక పట్టుదలతో ఎదుర్కొంటున్న తీరు ప్రత్యేకంగా నిలుస్తోంది.ఈ క్రమంలో తొలి సెట్‌ను అలవోకగా గెలిచిన అల్కరాజ్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. బలమైన ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో చెలరేగిన మరోజాన్‌ సెట్‌ గెలిచి పోటీలోకి వచ్చాడు. అయితే వెంటనే తేరుకున్న అల్కరాజ్‌ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తు వేస్తూ వరుస పాయింట్లు కొల్లగొట్టాడు. మ్యాచ్‌ మొత్తంలో ఐదు ఏస్‌లు, ఒక డబుల్‌ ఫాల్ట్‌(Double fault) చేసిన అల్కరాజ్‌ 25 అనవసర తప్పిదాలు చేశాడు. మరో పోరులో కాస్పర్‌ రూడ్‌ 6-2, 4-6, 1-6, 0-6తో నునో బోర్డెస్‌ చేతిలో ఓడాడు.

Read Also: IPL Playoffs: ఉద్రిక్తవేళా ప్లేఆఫ్స్‌ మ్యాచ్ లకు గట్టి భద్రత ఏర్పాటు

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.