US: ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

Read Time:  1 min
ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు
ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు
FONT SIZE
GET APP

సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు ఈరోజు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరాయి. గ్రీన్‌లాండ్ వివాదం నేపథ్యంలో పలు యూరోపియన్ దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) హెచ్చరించడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు పరుగులు పెట్టారు. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా పసిడి, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి ఫ్యూచర్స్ బంగారం ధర 1.68 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,44,905 పలికింది. అలాగే మార్చి ఫ్యూచర్స్ వెండి ధర ఏకంగా 4.39 శాతం వృద్ధితో కేజీకి రూ. 3,00,400 వద్ద ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో కూడా ఔన్స్ బంగారం ధర 1.6 శాతానికి పైగా పెరిగి 4,700 డాలర్ల స్థాయిని తాకింది.

Read Also: Switzerland: జ్యూరిక్ చేరుకున్న మంత్రి లోకేశ్

US: ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు
US: ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

దిగుమతులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరిక

గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికాను అనుమతించే వరకు యూరప్‌లోని ఎనిమిది దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామంతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగి, వారు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం, వెండి వైపు మళ్లించారు. రాజకీయ అస్థిరత, అమెరికా ద్రవ్య విధానంపై నెలకొన్న సందేహాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడ్డాయని మెహతా ఈక్విటీస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రి తెలిపారు. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ వంటి రంగాల్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ కూడా దాని ధరల పెరుగుదలకు కార‌ణ‌మ‌వుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.