📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gautam Gambhir: టీమిండియా కోసం ఇంగ్లండ్‌ పయనం కానున్న గౌతమ్?

Author Icon By Anusha
Updated: June 16, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా

ఈ నెల 11వ తేదీన గౌతమ్ గంభీర్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు హార్ట్ ఎటాక్ రావడంతో తీవ్ర ఆరోగ్య పరిస్థితుల మధ్య ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ఐసీయూలో చేర్పించారు. ఈ సమయంలో గంభీర్ (Gautam Gambhir) ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా, తల్లికి హార్ట్ ఎటాక్ అని తెలిసిన వెంటనే ఆయన వెంటనే భారత్‌కు తిరిగొచ్చారు.హాస్పిటల్ బెడ్‌పై తల్లి ఉన్నప్పటికీ, టీమిండియా కోసం ఇంగ్లండ్ పయనానికి సిద్ధమయ్యాడు. గౌతమ్ గంభీర్ నిబద్ధత, అంకితభావానికి ఇదో నిదర్శనం. గౌతమ్ గంభీర్ అమ్మకు హార్ట్ ఎటాక్ (Heart attack) రావడంతో హుటాహుటిన ఇంగ్లండ్ నుంచి ఇండియా వచ్చిన గంభీర్ ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గంభీర్ కమిట్‌మెంట్‌కు టీమిండియా ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.

క్రికెట్ అకాడమీ

గంభీర్ భారత్‌కు రాగానే ఇండియా, ఇండియా ఏ మధ్య మ్యాచ్‌‌ను పర్యవేక్షించే బాధ్యతలను అసిస్టెంట్ కోచ్‌లతో పాటు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీద ఉంచారు. గంభీర్ ఈ సిరీస్‌కు దూరమవుతాడనే వార్తలు రావడంతో టీమిండియా ప్లాన్ బీలో పడింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ (VVS Laxman) కు బాధ్యతలు అప్పగించాలని చూసింది. అధికారిక ప్రకటన వెలువడనుంది అనగా గంభీర్ మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి.శుభమన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఈ నెల 20 నుంచి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది.

ప్రాక్టీస్ మ్యాచ్

రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో మొత్తం యువ జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం టీమిండియా ఏ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడింది. భారత్, భారత్ ఏ ఆటగాళ్లు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడారు.జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఇంగ్లండ్-ఇండియా మధ్య మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (World Test Championship) 2025-27 సీజన్ కూడా భారత్‌కు ఈ ట్రోఫీ‌తోనే ప్రారంభం కానుంది. దాంతో ఈ సిరీస్ అటు ఇంగ్లండ్, ఇటు ఇండియాకు కీలకంగా మారింది.

టీమిండియా జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్.

Read Also: Yograj Singh: బీసీసీఐపై యోగరాజ్ సింగ్ ఘాటు విమర్శలు

#GambhirMother #GautamGambhir #HeartAttack #MotherHealth Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.