📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rodrigo Duterte: జైలు నుంచి పోటీ..మేయర్‌గా ఎన్నికైన ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో

Author Icon By Vanipushpa
Updated: May 15, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ది హేగ్‌లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ((nternational Criminal Court) (ఐసీసీ) నిర్బంధంలో ఉన్న ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు (President) రోడ్రిగో డ్యూటర్టే(Rodrigo Duterte). మేయర్ ఎన్నికల్లో (Mayor Elections) భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన స్వస్థలం దావావో నగర మేయర్‌(Mayor)గా ఎన్నికయ్యారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో డూటర్టే మేయర్‌గానూ.. ఆయన చిన్న కుమారుడు సెబాస్టియన్ డ్యూటర్టే డిప్యూటీ మేయర్‌గా విజయం సాధించడం విశేషం. 80 ఏళ్ల డ్యూటర్టే.. 2016 నుంచి 2022 వరకూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి(President)గా కొనసాగారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నేరుగా విమర్శలు గుప్పించారు.

Rodrigo Duterte: జైలు నుంచి పోటీ..మేయర్‌గా ఎన్నికైన ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో

రెండో మనవరాలు స్థానిక ఎన్నికల్లో విజయం
తన పదవీకాలంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన ఆయ.. ముఠాల ఆటకట్టించి.. మాదక ద్రవ్యాలపై యుద్ధం చేశారు. ఇదే ఆయనను చిక్కుల్లో పడేసింది. మానవహక్కుల ఉల్లంఘన, హత్యల ఆరోపణలపై ICCలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన మాత్రం తాను ఏం తప్పు చేయలేదని స్పష్టం చేశారు. డ్యూటెర్ట్ కుటుంబ సభ్యులు కూడా ఈ మధ్యంతర ఎన్నికల్లో ఆశించినదానికన్నా మెరుగైన ఫలితాలను సాధించారు. ఆయన పెద్ద కుమారుడు పాలో డ్యూటర్టే మళ్లీ హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ సభ్యుడిగా విజయం సాధించగా.. రెండో మనవరాలు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఫిలిప్పీన్‌కు చెందిన రాజకీయ నాయకుడు క్రిస్రియన్ సియా ఇచ్చిన ఆఫర్ వివాదాస్పదమైంది.
హత్యా నేరాల కింద డ్యూటర్టే‌ను అరెస్ట్
సెనేట్ ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సినప్పటికీ డ్యూటర్టే కుటుంబం మద్దతుతో ఉన్న కనీసం ఐదుగురు ముందంజలో ఉన్నారని అంచనాలు సూచిస్తున్నాయి. ముందస్తు సర్వేలు కేవలం ఇద్దరే గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి. రోడ్రిగే డ్యూటెర్ట్ సారా.. ప్రస్తుతం ఫిలిప్సీన్స్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ ఫలితాలు జులైలో జరగనున్న అభిశంసనకు ముందు ఆమెకు ఊరటనిచ్చాయి. అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఆయన భార్య, హౌస్ స్పీకర్‌పై హత్యాయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో సారాపై విచారణ జరగనుంది.
మానవహక్కుల ఉల్లంఘన, హత్యా నేరాల కింద డ్యూటర్టే‌ను అరెస్ట్ చేసి.. ICCకి తరలించడంతో ఆయన అభిమానుల పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘పనిషర్, ‘డర్టీ హ్యారీ’గా పిలుచుకునే డ్యూటర్టే, అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ముందు దావావో మేయర్‌గా రెండు దశాబ్దాలపాటు సేవలందించారు.
ఎన్నికలలో పోటీ చేయవచ్చు
ఫిలిప్పీన్స్ చట్టం ప్రకారం, నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు, ఇంకా తీర్పు వెల్లడవకపోతే లేదా అప్పీలులన్నీ పూర్తికాకపోతే ఎన్నికలలో పోటీ చేయవచ్చు. సారా డ్యూటర్టే మీడియాతో మాట్లాడుతూ, తండ్రి మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయడానికి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి డిప్యూటీ మేయర్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్యసమితి, పలు పశ్చిమ దేశాలు డ్యూటర్టే విధానాలపై తీవ్రమైన విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆయనకు ప్రజా మద్దతు పుష్కలంగా ఉండటం విశేషం.

Read Also: Puran Kumar Sha: భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాకిస్థాన్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu elected mayor from prison Former Philippine President Rodrigo Duterte Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.