📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Nasir: బయటపడ్డ పాకిస్థాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ అసలు బుద్ధి

Author Icon By Vanipushpa
Updated: June 7, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సరిహద్దులు దాటి జరుగుతున్న గూఢచర్య కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న భారతీయ ఏజెన్సీలు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చాయి. పాకిస్థాన్(Pakistan) పోలీస్ శాఖలో గతంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత యూట్యూబర్‌(Youtuber) గా మారిన నాసిర్ అనే వ్యక్తి, ఐఎస్ఐకి కీలక హ్యాండ్లర్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భారతీయ యూట్యూబర్లు, సోషల్ మీడియా(Social Media) ఇన్ ఫ్లుయెన్సర్లను లక్ష్యంగా చేసుకుని ఈ గూఢచర్య నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబర్‌గా అవతారమెత్తిన నాసిర్‌
కొన్నేళ్ల క్రితం ఐఎస్ఐ నాసిర్‌ను తమ ఏజెంట్‌గా నియమించుకుందని, ఆ తర్వాత అతను స్వచ్ఛందంగా పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబర్‌గా అవతారమెత్తాడని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. నాసిర్, నౌషాబా షెహజాద్ అలియాస్ మేడమ్ ఎన్ కలిసి భారతీయ ఇన్ ఫ్లుయెన్సర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఐఎస్ఐ ఆదేశాల మేరకు వీరు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Nasir: బయటపడ్డ పాకిస్థాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ అసలు బుద్ధి

“భారతీయ యూట్యూబర్లు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు, ప్రాథమిక పరిచయాల అనంతరం నాసిర్ వారిని హైకమిషన్ అధికారి డానిష్ తదితరులతో కలిపిస్తాడు. ఆ తర్వాత వారికి గూఢచర్య పనులు అప్పగించడం, ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు అతిథులుగా ఆహ్వానించడం వంటివి చేసేవారు” అని ఒక దర్యాప్తు అధికారి వివరించారు. ఈ ఏడాది మే నెలలో, హర్యానా పోలీసులు ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన తర్వాత డానిష్‌ను భారత్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.
జస్బీర్ సింగ్ విచారణలో నాసిర్ పేరు
గత వారం అరెస్టయిన మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్ విచారణలో కూడా నాసిర్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. భారత సైనిక బలగాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లు జస్బీర్ సింగ్‌పై ఆరోపణలున్నాయి. నాసిర్ ఫైసలాబాద్‌లో స్థిరపడి, ప్రాపర్టీ డీలర్‌గా కూడా పనిచేస్తున్నాడని, ఖరీదైన ఎస్‌యూవీ కార్లలో తిరగడం అతనికి ఇష్టమని దర్యాప్తులో తేలింది. “అతనికి యూట్యూబ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులను కలవాలనుకునే భారతీయులకు వీసాలు ఇప్పించాలని తన వీడియోల ద్వారా అతను వాదిస్తుంటాడు. అయితే, ఇదంతా తన గూఢచర్య కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక ముసుగు మాత్రమే” అని ఒక సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.
ఫైవ్ స్టార్ హోటళ్లలో విలాసవంతమైన వసతి
నాసిర్, పాకిస్థాన్‌లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న నౌషాబా షెహజాద్ కలిసి, సహకరించిన వారికి వీసాలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో విలాసవంతమైన వసతి వంటి సౌకర్యాలు కల్పించేవారని వెల్లడైంది. వీటికి బదులుగా, పాకిస్థాన్‌కు అనుకూలంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, పాక్‌కు అనుకూలమైన ప్రచారం కల్పించాలని ఆ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఒత్తిడి తెచ్చేవారని అధికారులు పేర్కొన్నారు. ఈ విధంగా, భారతీయ యూట్యూబర్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంతో పాటు, కీలక సమాచారాన్ని సేకరించడమే వీరి ప్రధాన లక్ష్యంగా దర్యాప్తులో స్పష్టమైంది.

Read Also: Tejashwi Yadav: తేజస్వి యాదవ్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Former Pakistani police officer Google News in Telugu Latest News in Telugu Nasir's Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today true intelligence revealed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.