📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Donald Trump: ట్రంప్‌ను చంపేస్తారా అంటూ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్‌పై దుమారం!

Author Icon By Vanipushpa
Updated: May 16, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) హత్యకు కుట్ర జరుగుతోందా? ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ (Director James kamii) సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇదే చర్చను లేవనెత్తింది. ఆయన సోషల్ మీడియా పోస్ట్ దుమారం రేపడంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి. మరోవైపు, తన పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని కామీ వివరణ ఇచ్చారు. జేమ్స్ కామీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘86 47’ అనే అంకెలను పోస్ట్ చేసి, కొద్దిసేపటికే దానిని తొలగించారు. అయితే, ‘47వ అధ్యక్షుడిని చంపడం’ (47th President killed) అనే అర్థం వచ్చేలా ఈ రహస్య కోడ్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వివాదాస్పద పోస్ట్‌పై అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని హోంల్యాండ్ (Home land)సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ అధికారికంగా వెల్లడించారు.

Donald Trump: ట్రంప్‌ను చంపేస్తారా అంటూ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ పోస్ట్‌పై దుమారం!

హింస అంటేనే తనకు ఇష్టం లేదు
ఈ ఆరోపణలపై జేమ్స్ కామీ స్పందించారు. తాను బీచ్‌లో నడుస్తున్నప్పుడు కనిపించిన కొన్ని గవ్వల (షెల్స్) చిత్రాన్ని పోస్ట్ చేశానని, ఆ పోస్ట్‌లోని అంకెలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని తెలిపారు. ఆ అంకెలను కొందరు హత్యలకు సంకేతంగా ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, హింస అంటేనే తనకు ఇష్టం ఉండదని కామీ అన్నారు. కాగా, గతంలో డొనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ భవనంపై నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు

Read Also: Pakistan: శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తాం : షెహ‌బాజ్ ష‌రీఫ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu former director James Comey' Google News in Telugu kill Trump! Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.