📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Singapore Container: సింగపూర్​ కంటైనర్ షిప్​లో అగ్నిప్రమాదం- నలుగురు గల్లంతు!

Author Icon By Vanipushpa
Updated: June 10, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేరళ(Kerala) తీరం సమీపంలో సింగపూర్(Singapore) పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్​ నౌకలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. దీనితో ఓడ(Ship) మంటల్లో చిక్కుకుంది. అవి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ప్రమాద సమయంలో అందులో 22 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 18 మందిని కాపాడినట్లు రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదు. వారి వివరాలు తెలియాల్సి ఉందని భారత కోస్ట్ గార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
అప్రమత్తమమైన కొచ్చిన్​లోని నౌకాదళం
కేరళ తీరానికి 78 మైళ్ల దూరంలో సింగపూర్​ జెండాతో కంటైనర్​ షిప్​లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన వారిని భారత నావికాదళ సిబ్బంది న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ పనంబూర్​కు తీసుకువచ్చారు. ప్రమాదకర రసాయనాలతో ప్రయాణిస్తున్న ఎమ్​వీ వాన్​ పై 503 నౌక కేరళ తీర సమీపానికి రాగానే ఉదయం 3:00 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న కొచ్చిన్​లోని నౌకాదళం అప్రమత్తమయ్యంది. అత్యవసర సహాయం కోసం ఐఎన్​ఎస్​ సూరత్​కు నౌకను తరలించారు. ఐఎన్​ఎస్​ గరుడ నుంచి డోర్నియల్​ విమానంతో ఆ ప్రదేశంలో గస్తీ నిర్వహిస్తోంది.

Singapore Container: సింగపూర్​ కంటైనర్ షిప్​లో అగ్నిప్రమాదం- నలుగురు గల్లంతు!

ఇద్దరి పరిస్థితి విషమం
ఈ నెల 7న శ్రీలంకలోని కొలంబో తీరం నుంచి బయలుదేరిన ఈ నౌక మంగళవారం ముంబయి చేరుకోవాల్సి ఉంది. జూన్​ 9న నౌకలో మంటలు చెలరేగాయి. అత్యవసర కాల్​కు భారత నావికాదళం వెంటనే స్పందించింది. 18 మంది సిబ్బందిని రక్షించింది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 5 మంది గాయపడ్డారు. ఆ సిబ్బందిని ఐఎన్​ఎస్​ సూరత్ ద్వారా మంగళూరులోని ఎన్​ఎమ్​పీఎకి తీసుకువచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు స్థానిక ఓడరేవు, పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

రక్షించిన సిబ్బందిలో 8 మంది చైనీయులు, నలుగురు తైవానీస్​, మరో నలుగురు మయన్మార్​, ఇద్దరు ఇండోనేషియన్లులు ఉన్నారు. 22 మంది సిబ్బందిలో నలుగురు తప్పిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో యు బో-ఫాంగ్, శాన్ విన్, జీనల్ అబిదిన్ హ్సీ చియా-వెన్ తప్పిపోయినట్లు సమాచారం అందించారు. కంటైనర్లలో పేలుళ్ల కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా పేలుతూ కంటైనర్లు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ ఎత్తున పొగ దట్టంగా అలుముకుంది. కోస్ట్ గార్డ్‌కు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మంగళూరులోని కుంటికానాలోని ఏజే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Read Also: Poverty : దేశంలో మరింత తగ్గనున్న పేదరికం – SBI

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Fire on Singapore container shi four missing! Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.