📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Canada: కెనడాలోని కార్చిచ్చు.. వేలమంది తరలింపు..!

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా(Canada) పశ్చిమ భాగంలో ఉన్న సస్కట్చివాన్‌ ప్రావిన్స్‌లో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపించింది.
దాంతో అక్కడ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఈ కార్చిచ్చు ప్రభావం ఇప్పటికే పక్కనున్న మాంటోబా ప్రావిన్స్‌(Mantobha Pravence) వరకూ విస్తరించింది. మాంటోబాలో పరిస్థితి అదుపుతప్పడంతో దాదాపు 17,000 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సస్కట్చివాన్‌ ప్రీమియర్‌ స్కాట్ మో మాట్లాడుతూ, తమ ప్రావిన్స్‌ అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నామని వెల్లడించారు.

Canada: కెనడాలోని కార్చిచ్చు.. వేలమంది తరలింపు..!

4,000 మందిని తరలించారు
ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 4,000 మందిని తరలించినట్లు సమాచారం.
కార్చిచ్చు ప్రామాదకరంగా వ్యాపించి సుమారు 6,69,000 ఎకరాల మేర విస్తరించింది.
రంగంలోకి కెనడా వైమానిక దళం
ఈ పరిస్థితి తక్షణంలో చల్లబడే అవకాశమే లేదని,రాబోయే రోజుల్లో మరింత క్లిష్టంగా మారవచ్చని అక్కడి సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఇక బుధవారం రోజున మాంటోబా ప్రావిన్స్‌లో కూడా అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించారు. చిన్నచిన్న గ్రామాలు,పట్టణాలు ఖాళీ చేయించాల్సిన స్థితి ఏర్పడింది.ఇలాంటి స్థాయిలో కార్చిచ్చు గతంలో ఎప్పుడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కెనడా వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది.
ఇప్పటివరకు మాంటోబాలో సుమారు 1,73,000ఎకరాల భూమి కాలిపోయింది.
కార్చిచ్చును నియంత్రించేందుకు వర్షం అనివార్యమని భావిస్తున్నారు.రెండు లేదా మూడు రోజులు వర్షం పడితే తప్ప ఇది అదుపులోకి రానని అంచనా వేస్తున్నారు.
ఈకార్చిచ్చు కారణంగా ఏర్పడుతున్న ఘనమైన పొగ కణాలు అమెరికాలోని మిన్నెసోటా,మిషిగన్‌ వంటి రాష్ట్రాల వైపు ప్రవహిస్తున్నాయి.
15 లక్షల ఎకరాల భూభాగం అగ్నికి ఆహుతి
కేవలం ఈ రెండు ప్రావిన్స్‌లలోనే 2025లో దాదాపు 15 లక్షల ఎకరాల భూభాగం అగ్నికి ఆహుతైనట్లు లెక్కలు చెబుతున్నాయి. కెనడా సహజ వనరుల శాఖ తాజా నివేదిక ప్రకారం, 2025లో దేశవ్యాప్తంగా మొత్తం 6,000 కార్చిచ్చు సంఘటనలు సంభవించాయి.
వీటి ద్వారా సుమారు 3.7 కోట్ల ఎకరాల భూమి పూర్తిగా కాలిపోయిందని పేర్కొన్నారు.
ఈ కార్చిచ్చుల ప్రభావం కేవలం కెనడాలోనే కాదు.. అమెరికా దేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది.
అమెరికన్ లంగ్ అసోసియేషన్ 2025లో విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ది ఎయిర్’ రిపోర్టు ప్రకారం, కెనడాలో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల వల్ల అమెరికాలోని ప్రజలు శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది.

Read Also: Harverd: హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆంక్షలపై కోర్టు స్టే పొడిగింపు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Fire in Canada. Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Thousands evacuated..!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.