📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Flight: ప్రమాదానికి పక్షి కారణం కావచ్చు అంటున్న నిపుణులు!

Author Icon By Vanipushpa
Updated: June 12, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌(London)కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా, ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమై ఉండొచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ 171) అహ్మదాబాద్(ahmedabad) నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి ప్రయాణికులతో బయలుదేరింది. విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం ఎయిర్ పోర్టు సమీపంలో కూలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొని ఉండవచ్చని, దాని కారణంగా విమానం టేకాఫ్‌కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ఎన్డీటీవీకి తెలిపారు.

Plane Crash: ప్రమాదానికి పక్షి కారణం కావచ్చు అంటున్న నిపుణులు!

రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చు: సౌరభ్ భట్నాగర్

విమానయాన రంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ మాట్లాడుతూ, “ప్రాథమికంగా చూస్తే, ఇది కొన్ని పక్షులు ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనివల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకునే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది” అని వివరించారు. “దృశ్యాలను బట్టి చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండానే జరిగినట్లుంది. విమానం నియంత్రిత పద్ధతిలోనే కిందకు వచ్చింది. పైలట్ ‘మేడే’ కాల్ ఇచ్చారు, అంటే అది అత్యవసర పరిస్థితి అని అర్థం” అని నొక్కి చెప్పారు.

ఈ దుర్ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. “ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు” అని ఎయిర్ ఇండియా తెలిపింది. “గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నాం” అని పేర్కొంది.

20 మంది మెడికోలు మృతి

విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుకు స‌మీపంలోని సివిల్ ఆస్పత్రి వ‌ద్ద బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భ‌వ‌నంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్‌ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Air India: ప్రమాదానికి ముందు ‘మేడే కాల్’ చేసిన పైలట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Experts say a bird Google News in Telugu Latest News in Telugu may have caused the accident! Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.