📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే ఫైగ్లిన్

Author Icon By Vanipushpa
Updated: May 22, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్-హమాస్(Israel మధ్య జరుగుతున్న యుద్ధంతో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్(Israel) రాత్రి, పగలు అనే తేడా లేకుండా చేస్తున్న డ్రోన్ దాడుల్లో గాజా(Gaza)లోని చిన్న పిల్లలు, మహిళలు సహా అమాయక ప్రజలంతా చనిపోతున్నారు. వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక నిత్యం నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారో కూడా తెలియక.. రక్తపు మడగులు, శవాల దిబ్బల మధ్యే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
శిథిలాల దిబ్బగా గాజా
ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మరీ తీవ్రంగా ఉండటంతో గాజా శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఐరాస కూడా స్పందించింది. గాజాలో ఏమాత్రం మానవతా సాయం కొనసాగడం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడ 48 గంటల్లోనే 14 వేల మంది వరకు చిన్న పిల్లలు చనిపోతారని హెచ్చరికలు జాపీ చేసింది. వారిని కాపాడుకునేందుకు 100 ట్రక్కుల మానవతా సాయాన్ని పంపాలని ఆదేశాలిచ్చింది. కానీ ఇదేమీ పట్టించుకోని ఇజ్రాయెల్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మోషే ఫైగ్లిన్ అనే నాయకుడు గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే అంటూ వ్యాఖ్యానించారు.

Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే

తమ శత్రువు హమాస్ అలాగే దాని మిలిటరీ వింగ్ మాత్రమే కాదని, గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువేనంటూ వ్యాఖ్యానించారు. గాజాను పూర్తిగా ఆక్రమించుకుని అక్కడే స్థిరపడాలని అన్నారు. గాజాలో ఒక్క బిడ్డ కూడా మిగలదని, దానికి మించి మరో విజయం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై కొన్ని రోజుల క్రితమే ఆ దేశ విశ్రాంత చీఫ్ మండిపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చిన్నారులను చంపడం హాబీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ చీఫ్ యాయిర్ గొలాన్. ఈ క్రమంలోనే మోషే ఫైగ్లిన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం..
2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను బ్రిటన్ నిలిపి వేసింది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సహాయాన్ని నెతన్యాహూ ప్రభుత్వం ఆపి వేసింది. మిత్ర దేశాల నుంచి దౌత్యపరంగా వచ్చిన ఒత్తిడితో పరిమిత మానవతా సాయానికి ఇటీవల నెతన్యాహూ అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గత నాలుగు రోజుల్లోనే ఏకంగా 600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఫీల్డ్ హాస్పిటల్స్ అధిపతి డాక్టర్ మార్వాన్ అల్-హామ్స్ తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది గాయపడ్డారు. చాలా మంది వికలాంగులుగా మారారు. మరోవైపు తమ దేశీయులను హమాస్ బందీలుగా తీసుకుందని, వారిని విడిచిపెట్టేంత వరకు తమ పోరు ఆపేది లేదని నెతన్యాహూ చెబుతున్నారు.

Read Also: New Orleans Archdiocese: లైంగిక వేధింపుల బాధితులకు $180 మిలియన్ల పరిహారం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Every child Google News in Telugu in Gaza is their enemy Latest News in Telugu Moshe Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.