📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

England Team: భారత్ తో తోలి టెస్ట్ ఆడనున్న ఇంగ్లండ్ జట్టు

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 5:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌తో జరగనున్న ప్రతిష్ఠాత్మక టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) గురువారం తమ 14 మంది సభ్యులతో కూడిన టెస్ట్ జట్టును అధికారికంగా ప్రకటించింది. జట్టుకు బెన్ స్టోక్స్ మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జామీ ఓవర్టన్ పునరాగమనం చేశాడు.జూన్ 20 నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం(Headingley Groundలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన సర్రే ఆటగాడు గస్ అట్కిన్సన్ స్థానంలో జామీ ఓవర్టన్‌ను ఎంపిక చేశారు. 31 ఏళ్ల ఓవర్టన్, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఒకే ఒక టెస్టు ఆడాడు. తన ఏకైక టెస్టు మ్యాచ్‌ను 2022లో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఆ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి, రెండు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

టెస్టు సిరీస్‌

జట్టు కూర్పులో అనుభవజ్ఞులైన జో రూట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్ వంటి ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులైన షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్‌లకు కూడా చోటు కల్పించారు. దీంతో ఇంగ్లండ్ జట్టు యువత, అనుభవం కలగలిసిన సమతూకంతో బరిలోకి దిగనుంది.21 ఏళ్ల జాకబ్ బెథెల్ తిరిగి జట్టులోకి రావడం బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇటీవల ఐపీఎల్‌ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) టీమ్ సభ్యుడైన బెథెల్, న్యూజిలాండ్‌లో తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసి మూడు అర్ధశతకాలతో 52 సగటుతో రాణించాడు. అతని రాకతో ఓలీ పోప్, జాక్ క్రాలీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇటీవలి జింబాబ్వే సిరీస్‌లో వీరిద్దరూ శతకాలు సాధించడం గమనార్హం.

England Team

ఇంగ్లండ్ జట్టు

పేస్ దళానికి క్రిస్ వోక్స్, జోష్ టంగ్ అండగా నిలవనుండగా, సామ్ కుక్, బ్రైడన్ కార్స్ అదనపు బౌలింగ్ ఆప్షన్లుగా అందుబాటులో ఉంటారు. క్రిస్ వోక్స్, కార్స్ ఇద్దరూ గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. మరోవైపు, ఈ పర్యటనలో భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే,బెన్ స్టోక్స్ (కెప్టెన్) షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.

Read Also: Harsh Goenka: సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా అంటూ గోయెంకా తీవ్ర విచారం వ్యక్తం

#BenStokes #EnglandCricket #INDvsENG #TestCricket Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.