📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ట్రంప్ దూకుడుతో అయోమయంలో ఉద్యోగులు

Author Icon By Vanipushpa
Updated: March 5, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరోనాతో కకలావికలం అయిన ఆర్థిక వ్యవస్థలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని త్రైమాసికాలుగా తేరుకుంటూ ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆర్థిక వృద్ధి తిరిగి పుంజుకుంటున్న వేళ ట్రంప్ వాణిజ్య యుద్ధ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా అస్థిరతలను సృష్టిస్తోంది. ఈ ప్రభావం అమెరికాలోని కంపెనీలపై పడింది. దీంతో ప్రస్తుతం టాప్ కంపెనీలు కూడా లేఆఫ్స్ బాట పడుతున్నాయని తెలుస్తోంది.
ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు
గత సంవత్సరం గమనించిన ఉద్యోగాల కోతల ధోరణిని అనేక అమెరికా కంపెనీలు ప్రస్తుతం తిరిగి కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి క్రమబద్ధీకరించే ప్రయత్నిస్తూ లాభదాయకతను కొనసాగించాలని అనేక యూఎస్ కంపెనీలు వివిధ రంగాల్లో ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించాయి. ఫిబ్రవరి ప్రారంభంలో విడుదలైన కార్మిక శాఖ ఉద్యోగ ఖాళీలు కార్మిక టర్నోవర్ సర్వే ప్రకారం మునుపటి సంవత్సరంతో పోలిస్తే డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు 1.3 మిలియన్లు తగ్గాయని తేలింది. ఇది జాబ్ మార్కెట్లో మందగమనాన్ని సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపులు
ఒక పక్క ట్రంప్ ఈవారం నుంచి చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ టారిఫ్స్ అమలులోకి తీసుకొస్తుండగా.. ఈ వారం యూఎస్ టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు పెరిగాయి. ఈ క్రమంలో పేరుగాంచిన ఐటీ కంపెనీలు దాదాపు 6,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఒన్సేమి ఇంటెలిజెంట్ టెక్నాలజీ 2,400 ఉద్యోగుల కోతతో ముందు వరుసలో నిలవగా.. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆటోడెస్క్ దాదాపు 1,350 ఉద్యోగాలను తగ్గించింది. ఇదే క్రమంలో హెచ్పీ సంస్థ 2000 మంది వరకు ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగుల కోత అమెరికాని వారిపై ఉంటుందా లేక ప్రపంచ వ్యాప్తంగా ఇతర ప్రదేశాల్లోనివారిపై ఉంటుందా అనే విషయం స్పష్టత రాలేదు.

కనుమరుగవుతున్న ఆరోగ్య సంరక్షణ కంపెనీ

మహిళలకు అన్ని ఆరోగ్య సేవలతో పాటు బ్యూటీ అండ్ వెల్నెస్ సేవలను అందించే HerMD సంస్థ మూతపడుతున్నట్లు ప్రకటించడంతో ఆరోగ్య సంరక్షణ రంగం మరో కంపెనీ కనుమరుగవుతున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో స్టార్ బక్స్ 1100, బ్రౌన్ ఫార్మ్ 648, కోల్స్ 9600, ఇస్టీ లాడర్ 7000, అమెజాన్ 1700, వాల్ మార్ట్, వే ఫెయిర్ 730, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ 1750, బ్లూ ఆరిజిన్ 1400 మంది ఉద్యోగులను తొలగించాయని వెల్లడైంది. అలాగే ఉద్యోగుల తొలగింపులు ఎనర్జీ, టెక్నాలజీ అండ్ మీడియా, ఫార్మా అండ్ హెల్ కేర్ సహా అనేక ఇతర రంగాల్లోని కంపెనీలకు సైతం విస్తరించటం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. మరో పక్క ట్రంప్ తన కాస్ట్ కట్టింగ్ లో భాగంగా చాలా మంది ఫెడరల్ ఉద్యోగులను కూడా ఇంటికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది భవిష్యత్తులో నిరుద్యోగిత రేటును పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Donald Trump Employees confused Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.