Elon musk : భారత్‌లో పర్యటించనున్న ఎలాన్‌ మస్క్‌

Read Time:  1 min
Elon Musk coming to India soon
Elon Musk coming to India soon
FONT SIZE
GET APP

Elon musk : ఈ ఏడాది చివర్లో అపర కుబేరుడు, స్పేస్‌ఎక్స్‌, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయం ఎక్స్‌ వేదికగా స్వయంగా ఆయన వెల్లడించారు. ప్రధాని మోడీతో సంభాషించడం గౌరవంగా భావిస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే మస్క్‌ భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పట్లో ఆయన మన పొరుగు దేశం చైనాను సందర్శించారు. ఓ వైపు వాణిజ్య ఒప్పందం కోసం భారత్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఎలాన్‌ మస్క్‌తో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు.

 త్వరలో భారత్‌కు రానున్న ఎలాన్‌

మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా..

సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ విషయాన్ని మోడీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్‌లో మా భేటీ సందర్భంగా చర్చించిన అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది అని ఆయన పేర్కొన్నారు. దీనికి స్పందనగా మస్క్‌ తన భారత పర్యటనను ధ్రువీకరించారు.

స్టార్‌ లింక్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

కాగా, మస్క్‌ నేతృత్వంలోని టెస్లా, స్టార్‌లింక్‌ సంస్థలు భారత విపణిలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే షోరూమ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టిన ఆ సంస్థ.. భారత్‌ రోడ్లపై ‘మోడల్‌ Y’ కారును పరీక్షిస్తోంది. తాజాగా ముంబయి-పుణె జాతీయ రహదారిపై ఈ వాహనం దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది. మరోవైపు స్టార్‌ లింక్‌ ప్రతినిధులు ఇటీవల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చలు జరిపారు. ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో ఇప్పటికే స్టార్‌ లింక్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

Read Also:  అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.