📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి: ఎలాన్‌ మస్క్‌

Author Icon By Vanipushpa
Updated: June 27, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధిక సంతానం మంచిది కాదనే వాదనను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ (Tesla ceo elon musk) ఎప్పుడూ కూడా తప్పుబడుతుంటారు. తాజాగా ఆయన మరోసారి అదే వైఖరిని అనుసరించారు. ప్రస్తుతం అమెరికా(America)లో జననాల సంఖ్య తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వివిధ సమస్యల వల్ల ప్రపంచంలో జననాల(World Population) రేటు తగ్గుతోందని అన్నారు. దీన్ని నివారించాలంటే పిల్లల్ని కనగలిగేవారు కనీసం ముగ్గురిని కనాలని ఎక్స్‌(X)లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో జనాభా తగ్గుతుండటంతో సగటున ముగ్గురిని చెప్పిన ఫార్చ్యూన్(fortune report) రిపోర్టును ఉటంకిస్తూ మస్క్ పోస్టు చేశారు. “నా మాటలు నమ్మకపోతే, ఇంకో 20 ఏళ్లు వేచి చూడండి. నాగరికత ముప్పులో పడుతుంది.”
అని స్పష్టం చేశారు.

Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి: ఎలాన్‌ మస్క్‌

జనాభా రేటు పడిపోతున్నది: నిపుణులు
ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే సంపన్న దేశాలైన అమెరికా, ఇటలీ, జపాన్ వంటి దేశాల్లో జననాల రేటు ఏటా తగ్గుతోందని
దీనివల్ల జనాభా రేటు పడిపోతుందని నిపుణులు తెలిపారు. దీన్ని నివారించాలంటే సంతానం కనగలిగే మహిళలు కనీసం ముగ్గురిని కనాలని సూచించారు. ఈ క్రమంలోనే అమెరికా లాంటి దేశాల్లో జననాల రేటు తగ్గడం వల్ల నాగరికత పతనమయ్యే ప్రమాదం ఉందని ఎలాన్ మస్క్‌ అన్నారు. తన మాటలు నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని తెలిపారు. భారత మహిళలు సగటున 5 మంది పిల్లలు కనేవారు
తగ్గుతున్న జనాభాపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జనాభాపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొంది. వివిధ ఆరోగ్య సమస్యల వల్ల వందల మిలియన్ల మంది ప్రజలు తాము కొరుకున్నంతమంది పిల్లలను కనలేకపోతున్నట్లు తెలిపింది. సరైన భాగస్వామి దొరకకపోవడం, పిల్లలను పెంచేందుకు అధిక ఖర్చులు లాంటి విషయాలు దీనికి కారణమవుతున్నాయని వెల్లడించింది. ఇక సంతానోత్పత్తి రేటు తగ్గించడంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందని UNFPA భారత ప్రతినిధి ఆండ్రియా తెలిపారు. 1970లలో భారత్‌లోని మహిళలు 5 మందిని కనేవారని.. ప్రస్తుతం ఆ సంఖ్య పడిపోయిందని చెప్పారు. ఎలాన్ మస్క్ చేసిన సూచన అంతర్జాతీయంగా పాజిటివ్‌, నెగటివ్‌ అభిప్రాయాలను రేపుతోంది. కానీ మస్క్ స్పష్టం చేస్తున్న విషయమేమిటంటే, భవిష్యత్ నాగరికతను నిలబెట్టుకోవాలంటే జననాల స్థిరీకరణ అవసరం అని.

Read Also: Pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత గూఢచారి సమాచారం చైనా నుంచి వచ్చింది: పాక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Elon musk Elon Musk children Elon Musk demographics Elon Musk family policy Elon Musk fertility concerns Elon Musk future of humanity Elon Musk global population Elon Musk news Elon Musk on birth rate Elon Musk population warning Elon Musk social media Elon Musk three children advice Elon Musk tweets Elon Musk UN birth rate Elon Musk X post Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.