📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Earthquake: చైనాలో భూ ప్రకంపనలు

Author Icon By Vanipushpa
Updated: May 19, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో భూకంపం(China Earthquake) సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. సరిగ్గా మూడు రోజుల తేడాతో ఒకే ప్రాంతంలో భూమి ప్రకంపించడం ఇది రెండోసారి కావడం, దాని తీవ్రత కూడా దాదాపుగా ఒకేరకంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్(Riktar skel) పై 4.5గా రికార్డయింది. ఆదివారం రాత్రి సరిగ్గా 11 గంటల సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్న నగ్కు ప్రీ-ఫెక్షర్ లో భూమి ప్రకోపించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్ లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ (Seismology Centre)తెలిపింది.

Earthquake: చైనాలో భూ ప్రకంపనలు

ప్రాణనష్టంపై సమాచారం లేదు
ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. స్వల్పంగా ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నెల 16వ తేదీన చైనాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. 25.05 నార్త్ అక్షాంశం, 99.72 ఈస్ట్ రేఖాంశం పరిధిలోకి వచ్చే యునాన్ ప్రావిన్స్ పశ్చిమ ప్రాంతంలోని బావోషాన్, కున్మింగ్, అటానమస్ ప్రీ-ఫెక్చర్ లో భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ప్రాంతం మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉండటం వల్ల ప్రకంపనలు ఆ దేశంలో కూడా కనిపించాయి. మూడు రోజుల వ్యవధిలో దాదాపుగా ఒకేరకమైన తీవ్రతతో భూమి ప్రకంపించడం చర్చనీయాంశమైంది. దీనిపై చైనా భూగర్భ శాస్త్రవేత్తలు ద్రుష్టి సారించారు. అది కూడా ఒకే ప్రీ- ఫెక్చర్ లో ప్రకంపనలు రావడం అనేది చైనా భౌగోళికపరంగా అరుదుగా సంభవిస్తుంటుందని చెబుతున్నారు.
తరచుగా భూకంపం సంఘటనలు
కాగా- ఈ నెల 5వ తేదీన ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌, 12వ తేదీన సెంట్రల్ పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీనివల్ల ప్రాణ నష్టం సంభవించలేదు. ఆస్తినష్టం స్వల్పంగా కనిపించింది. 15వ తేదీన టర్కీలోనూ భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా రికార్డు అయింది. ఆ మరుసటి రోజే అంటే 16న, మళ్లీ ఇప్పుడు చైనాలో ఈ విపత్తు చోటు చేసుకోవడం అరుదుగా భావిస్తోన్నారు.

Read Also: Bangladesh: మర్డర్ కేసులో నటి నుస్రత్ ఫరియా అరెస్ట్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu earthquakes Google News in Telugu in China Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.