📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Earthquake: అమెరికాలో వరుసగా స్వల్ప భూ కంపాలు

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)తో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా(Argentina), పెరూ(Peru), ఫిలిప్పైన్స్‌(philippines)లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది. వరుస భూకంపాల నేపథ్యంలో బాబా వంగా(Baba Vanga) జోస్యంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అమెరికాలో వరుసగా స్వల్ప భూ కంపాలు నమోదవుతున్నాయి.

Earthquake: అమెరికాలో వరుసగా స్వల్ప భూ కంపాలు

ప్రజల్లో భయాందోళనలు

టెక్సాస్‌, కాలిఫోర్నియాలలో భూమి కదులు తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. థైవాన్‌లో నూ భూమి కంపించింది. మరోవైపు జపాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. టొకార దీవుల సమూహంలో గత రెండు వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకు అక్కడ ఏకంగా 900 సార్లు భూప్రకంపనలు నమోదవడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది. సగటున గంటకు మూడుసార్లకు పైగా భూమి కంపిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

సునామీ హెచ్చరికలు జారీ

బుధవారం కూడా ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జపాన్ వాతావరణ సంస్థ అధికారి అయాటకా ఎబిటా ఈ వివరాలను ధృవీకరించారు.

ఒక్కరోజే అత్యధికంగా 183 సార్లు ప్రకంపనలు

జూన్ 23న ఒక్కరోజే అత్యధికంగా 183 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. “నిరంతరం భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది” అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. టొకార దీవుల్లో జనాభా తక్కువగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఇక్కడ మొత్తం 12 దీవులు ఉండగా, ఏడింటిలో మాత్రమే సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారు.తాజాగా 5.5 భూకంపం రిక్టారు స్కేలుపై నమోదు అయింది. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. వరుస భూంకపాల నేపథ్యంలో యుగాంతం తప్పదని ప్రచారం సాగుతోంది.

Read Also: hindi.vaartha.com

Read Also: Trump: ట్రంప్ కఠిన టారిఫ్ వ్యూహం: వివిధ దేశాలకు కొత్త సుంకాల లేఖలు

#telugu News American earthquake today Ap News in Telugu Breaking News in Telugu earthquake in America earthquake news earthquake updates Google News in Telugu Latest News in Telugu natural disaster USA Paper Telugu News seismic zones in America Telugu News online Telugu News Paper Telugu News Today Today news tremors in US US seismic activity USA earthquake

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.