📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Dubai Crown Prince: లంచ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లి..అందరి బిల్లులు కట్టి సర్‌ప్రైజ్ చేసిన యువరాజు

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 8:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దుబాయ్ యువరాజు , ప్రజాదరణ పొందిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి తన ఔదార్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఇటీవలి రోజులలో ఆయన చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. లంచ్ కోసం వెళ్లిన సమయంలో, షేక్ హమ్దాన్ (Sheikh Hamdan)అక్కడి ప్రతి వ్యక్తి బిల్లు తన ఖర్చుతో చెల్లించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న వేళ, నెటిజన్లు ఆయనను ‘రియల్ ప్రిన్స్’, ‘మనసున్న మహారాజు’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్‌ను అందరూ ముద్దుగా ‘ఫజా’ అని పిలుస్తారు. ఫజా అంటే అరబిక్ భాషలో సాయం చేసేవాడు అని అర్థం. ఇటీవల షేక్ హమ్దాన్, అబుదాబీ యువరాజుతో కలిసి దుబాయ్‌లోని ఓ మాల్‌లో ఉన్న ‘లా మైసన్ అని’ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు.వారి వెంట పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు.

నెటిజన్లు రాజకుటుంబం మంచితనాన్ని కొనియాడుతున్నారు

యువరాజు రాకతో అక్కడున్న వాళ్లంతా సంతోషంలో మునిగిపోయారు. ఒక మహిళ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యువరాజు రాకతో మరచిపోలేని అనుభూతి కలిగిందని ఆమె అన్నారు. అంతేకాదు, రెస్టారెంట్‌కు వచ్చి అందరి బిల్లులను ఆయనే కట్టారని చెప్పారు. ఆ బిల్లుల మొత్తం రూ.6 నుంచి 7 లక్షల వరకు (25000 నుంచి 30000 దిర్హామ్‌లు) ఉంటుందని అంచనా వేశారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రాజకుటుంబం మంచితనాన్ని కొనియాడుతున్నారు. తండ్రి షేక్ మహమ్మద్ (Shaik Mohammad) లాగే క్రౌన్ ప్రిన్స్ దాతృత్వం చూపిస్తున్నారని చాలామంది కామెంట్ చేశారు. ‘దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.ఓ నెటిజన్ ‘ఫజా తనకు ఇష్టమైన పనే చేశాడు. ఎందుకంటే దుబాయ్ ఎందులోనైనా అగ్రస్థానంలో ఉంటుందో అర్థమవుతోంది!” అన్నారు. మరొకరు, “రాజ కుటుంబం ఎంత గొప్పదో చెప్పడానికి మాటలు చాలవు వారందరికి అల్లాహ్ దీర్ఘాయుష్షు ఇవ్వాలి. యూఏఈను కాపాడాలి’ అని కోరారు.

సాహస క్రీడలు అంటే చాలా ఇష్టం

షేక్ హమ్దాన్ 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయ్యారు. అంతకుముందు 2006 నుంచి 2008 వరకు డిప్యూటీగా పనిచేశారు. ఆయనకు కవిత్వంతో పాటు పారాచూట్ జంపింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలు అంటే చాలా ఇష్టం. పర్యావరణాన్ని కాపాడటానికి, దాతృత్వ కార్యక్రమాలకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. దుబాయ్ కేర్స్(Dubai Cares), పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ ఆయన సుదీర్ఘ సేవలందిస్తున్నారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందులో తన ఫోటోగ్రఫీ, జంతువులపై ప్రేమ, ఇతర హాబీలను తరుచూ క్రౌన్ ప్రిన్స్ పంచుకుంటుంటారు.

Read Also: Venkata Charan: విశాఖ వాసి వెంకట చరణ్‌కు అమెరికా అరుదైన గౌరవం

#DubaiCrownPrince #Fazza #SheikhHamdan #SheikhHamdanViral Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.