Scientists: డూమ్స్‌డే క్లాక్ వినాశనం హెచ్చరికలు

Read Time:  1 min
Scientists: డూమ్స్‌డే క్లాక్ వినాశనం హెచ్చరికలు
FONT SIZE
GET APP

ప్రపంచం ప్రమాదకరమైన మలుపులో నిలిచిందని అంతర్జాతీయ శాస్త్రీయ వర్గాలు మరోసారి హెచ్చరిస్తున్నాయి. మునుపెన్నడూ లేనంతగా మానవాళి స్వయంగా సృష్టించుకున్న విధ్వంసానికి చేరువైందని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్'(Bulletin of the Atomic Scientists) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ రాజకీయ పరిణామాలు, అణ్వస్త్ర దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కలిసి ప్రపంచ భవిష్యత్తును తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేశాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రతీకాత్మకంగా ఉపయోగించే ‘డూమ్స్‌డే క్లాక్’(Doomsday clock) సమయాన్ని మరోసారి ముందుకు జరిపినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ గడియారం అర్ధరాత్రి 12 గంటలకు కేవలం 85 సెకన్ల దూరంలో ఉందని వెల్లడించింది. అర్ధరాత్రి అంటే మానవాళి సంపూర్ణ వినాశనానికి ప్రతీకగా శాస్త్రవేత్తలు భావిస్తారు.

Read Also: Plane Crash: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే!

Scientists: డూమ్స్‌డే క్లాక్ వినాశనం హెచ్చరికలు
Scientists: డూమ్స్‌డే క్లాక్ వినాశనం హెచ్చరికలు

ప్రపంచం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందన్నది అంచనా వేసేందుకు ‘బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్’ ఒక ఊహాజనిత గడియారాన్ని ఉపయోగిస్తుంది. దానినే డూమ్స్‌డే క్లాక్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సైనిక, పర్యావరణ, సాంకేతిక పరిణామాలను బట్టి ఈ గడియారాన్ని ముందుకు లేదా వెనక్కి జరుపుతుంటారు. గడియారం అర్ధరాత్రికి ఎంత దగ్గరగా ఉందో… మానవాళి అంత ప్రమాదంలో ఉందన్న సంకేతంగా భావిస్తారు. గత ఏడాది ఈ గడియారం అర్ధరాత్రికి 89 సెకన్ల దూరంలో ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో మరో 4 సెకన్లు ముందుకు కదిలింది. పెరుగుతున్న అణు యుద్ధ ముప్పు ఈ ప్రమాదకర పరిస్థితులకు ప్రధాన కారణంగా అణ్వస్త్ర దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణలను సంస్థ ప్రస్తావించింది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ యుద్ధం ఎటువైపు మళ్లుతుందో అన్న అనిశ్చితి అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోందని తెలిపింది. ఇదే సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య గతేడాది మే నెలలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను కూడా సంస్థ ఉదహరించింది. అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య చిన్న స్థాయి ఘర్షణలు కూడా పెద్ద విపత్తుకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.