📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Elon Musk: నిరాడంబర జీవనశైలి అతని సక్సెస్ కి కారణమా?

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ఎలాన్ మస్క్(Elon Musk), టెస్లా మరియు స్పేస్‌ఎక్స్(Telsa,spacex) సంస్థల సీఈఓగా సుపరిచితులు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 409 బిలియన్ డాలర్లు(Billion dollars). ఇంతటి అపారమైన సంపద ఉన్నప్పటికీ, ఆయన జీవనశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, అత్యంత నిరాడంబరంగా ఉంటుంది. చాలా మంది సంపన్నులు ఇష్టపడే విలాసవంతమైన భవనాలు, ఖరీదైన ఆహారం లేదా విలాసవంతమైన కార్లు వంటి వాటిపై తాను డబ్బు ఖర్చు చేయనని మస్క్ గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అతి తక్కువ వస్తువులతో కూడిన సాధారణ జీవితాన్నే ఆయన ఇష్టపడతారు.

అవి ఒక రకమైన దాడికి లక్ష్యంగా..

2020 మే నెలలో తన ట్విట్టర్(Twitter) ఖాతాలో, “నేను దాదాపు నా భౌతిక ఆస్తులన్నింటినీ అమ్మేస్తున్నాను. ఇకపై నాకు సొంత ఇల్లు ఉండదు” అని మస్క్ ప్రకటించారు. ఆస్తులు అనేవి తమను బరువుగా మార్చేస్తాయని, అవి ఒక రకమైన దాడికి లక్ష్యంగా (ఎటాక్ వెక్టర్) ఉంటాయని ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. చెప్పినట్టుగానే, 2020 మరియు 2021 సంవత్సరాల మధ్య, కాలిఫోర్నియాలోని తన ఏడు ఇళ్లను దాదాపు 100 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అనంతరం, టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ సైట్ సమీపంలో కేవలం 375 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న బాక్సబుల్ ఇంట్లోకి మారినట్లు సమాచారం. ఈ ఇంటి విలువ సుమారు 50,000 డాలర్లు ఉంటుందని అంచనా.

Elon Musk: నిరాడంబర జీవనశైలి అతని సక్సెస్ కి కారణమా?

అమెరికాలో బ్రతకడం చాలా సులభం..

గతంలో ఒక ఇంటర్వ్యూలో, తన స్టార్టప్ ప్రారంభ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తింటూ, మిగిలిన ప్రతీ డాలర్‌ను తన వ్యాపారం కోసమే ఖర్చు చేసినట్లు మస్క్ గుర్తుచేసుకున్నారు. 17 ఏళ్ల వయసులో, రోజుకు కేవలం ఒక డాలర్ ఆహారంతో జీవించగలనా అని తనను తాను పరీక్షించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రయోగాన్ని “స్టార్‌టాక్”గా అభివర్ణిస్తూ, “అమెరికాలో బ్రతకడం చాలా సులభం. కాబట్టి నా మనుగడకు కావాల్సిన కనీస అవసరాలు చాలా తక్కువ.

పాత పరుపుతో సర్దుబాటు

గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ గతంలో మాట్లాడుతూ, మస్క్‌కు ఉండటానికి మరే చోటు లేనప్పుడు కొన్నిసార్లు తన ఇంట్లో ఉండటానికి అనుమతి అడిగేవారని తెలిపారు. 2022లో జరిగిన ఒక టెడ్ టాక్‌లో ఎలాన్ మస్క్ స్వయంగా, “ప్రస్తుతం నాకు సొంత ఇల్లు కూడా లేదు, నేను నిజంగా స్నేహితుల ఇళ్లలోనే ఉంటున్నాను” అని చెప్పడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం.మస్క్ మాజీ భాగస్వామి గ్రైమ్స్ ఒకసారి వానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మస్క్ కొన్నిసార్లు “పేదరికపు రేఖకు దిగువన” జీవించినట్లు పేర్కొన్నారు. మార్చి 2022లో జరిగిన ఆ ఇంటర్వ్యూలో, “అతను బిలియనీర్‌లా జీవించడు. కొన్ని సమయాల్లో పేదరికపు అంచుల్లో బతుకుతాడు” అని ఆమె అన్నారు.

సంపద పోగుచేసుకోవడం కంటే లక్ష్యాలపై దృష్టి

మస్క్ ఒకప్పుడు 1 మిలియన్ డాలర్ల విలువైన మెక్‌లారెన్ ఎఫ్1 కారును కొనుగోలు చేశారు. అయితే, దానిని ఇతరులకు చూపిస్తున్న సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. “ఇది చూడండి” అని ఆయన చెప్పిన వెంటనే కారు గాల్లోకి పల్టీ కొట్టి బోల్తా పడింది. “దానికి బీమా కూడా లేదు” అని మస్క్ ఆ తర్వాత అంగీకరించారు. ఆశ్చర్యకరంగా, అంత ఖరీదైన కారు ధ్వంసమైనప్పటికీ ఆయన దాని స్థానంలో మరో కారును కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా టెస్లా కార్లనే నడుపుతున్నారు.

Read Also: India: ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో భారత్ ఎటువైపు?

#Success #telugu News Ap News in Telugu Breaking News in Telugu does- drive Google News in Telugu his Latest News in Telugu Paper Telugu News simplicity Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.