📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Visa: మీకు త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలా? డబ్బులు చెల్లించండి

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 1:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా(America) వెళ్లి చదువుకోవాలని, అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడాలని చాలా మంది కలలు కంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల పౌరులు అమెరికా వెళ్లేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వీసాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కేవలం స్టూడెంట్ వీసా(Visa)లకే కాకుండా, బిజినెస్, టూరిస్ట్ ఇలా అంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. వీసా నిబంధనల్లో అనేక మార్పులు చేయగా ఈ సమస్యలు వస్తున్నాయి. దీంతో వీసా ఇంటర్వ్యూలు వివరంగా, కఠినంగా జరుగుతున్నాయి. ఫలితంగా పలువురు సంవత్సరాల పాటు వీసాల కోసమే తిరగాల్సి వస్తోంది.

Visa: మీకు త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలా? డబ్బులు చెల్లించండి

డబ్బులు చెల్లించిన వారికి వెంటనే వీసా ఇంటర్వ్యూ
ఈ సమస్యలను అర్థం చేసుకున్న అగ్రరాజ్యం ఇందుకు ఓ పరిష్కారాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రత్యేక విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చి ఇంటర్వ్యూల కోసం ఎవరూ వేచి చూడకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా డబ్బులు చెల్లించిన వారికి వెంటనే వీసా ఇంటర్వ్యూ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే ఇందుకోసం 1000 డాలర్లు చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం. అంతేకాదండోయ్.. దీన్ని త్వరలోనే అమల్లోకి కూడా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా విదేశాంగ శాఖ అంతర్గత మెమోలో ఈ మేరకే ఓప్రణాళికను ప్రస్తావించింది. ఇప్పటికే యూఎస్‌కు చెందిన ఓ అధికారి కూడా దీన్ని ధ్రువీకరించారు. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుగా 1000 డాలర్లు చెల్లిస్తే.. వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రస్తుతం టూరిస్టు, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద 185 డాలర్లను చెల్లిస్తున్నారు. ఇందుకు అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను 2025 డిసెంబర్‌లో పైలట్ ప్రోగ్రామ్‌గా ప్రారంభించే అవకాశం ఉంది.
ఖర్చును మించి ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధం
అయితే అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని లీగల్ సలహాదారులు.. ఈ ప్రతిపాదనపై చట్టపరమైన సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం సేవకు సంబంధించిన ఖర్చును మించి ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధం కావచ్చని వివరిస్తున్నారు. ఈ ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వంలోని మరిన్ని ఇమ్మిగ్రేషన్ నియంత్రణ చర్యలలో భాగంగా ఉంది. ఇందులో 5 మిలియన్ డాలర్లు చెల్లించే వారికి అమెరికా పౌరసత్వం కల్పించే “గోల్డ్ కార్డ్” ప్రోగ్రామ్ కూడా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ 10.4 మిలియన్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసింది. అందులో 5.9 మిలియన్ టూరిస్ట్ వీసాలు ఉన్నాయి.
ఈ కొత్త వీసా ఫీజు ప్రతిపాదన అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం.. 2025లో అమెరికాలో అంతర్జాతీయ ప్రయాణ ఖర్చులు సుమారు 7% తగ్గే అవకాశం ఉంది. ఇందుకు కారణం ట్రంప్ విధానాలపై తీవ్రమైన వ్యతిరేకత రావడం, అలాగే డాలర్ విలువ ఎక్కువగా పెరగడం.

Read Also: http://Bilawal Bhutto: అమెరికాలో బిలావల్ భుట్టో పర్యటనపై ఎంపీ తేజస్వీ సూర్య ఎద్దేవా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Do you need Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US visa interview quickly?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.