📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pahalgam Terror Attack: పాక్‌లోనూ అబీర్ గులాల్ మూవీ పై నిషేధం ఎందుకో తెలుసా?

Author Icon By Anusha
Updated: April 29, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల‌ తర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. నటి వాణి కపూర్ తో కలిసి ‘అబీర్ గులాల్’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఫ‌వాద్ ఖాన్. అయితే, పహల్గామ్‌లో జ‌రిగిన ఉగ్రదాడి తర్వాత ఈ సినిమాను కేంద్రం బ్యాన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. అలాగే పాకిస్థాన్ న‌టుల‌పై భార‌త్‌లో నిషేధం విధించిన‌ట్లు స‌మాచారం.జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై ఉగ్ర‌వాదులు దాడి జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్‌లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదిలావుంటే ఈ ఘ‌ట‌న అనంత‌రం పాకిస్థాన్‌కి చెందిన న‌టుల‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.అలాగే పాకిస్థాన్‌కి చెందిన న‌టుల‌పై భార‌త్‌లో నిషేధం విధించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ఈ మూవీ నుంచి రెండు పాట‌ల‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేయ‌గా తాజాగా వాటిని యూట్యూబ్‌లో నుంచి మేక‌ర్స్ తొల‌గించారు.

నిషేధం

పాకిస్తాన్ కూడా ఈ సినిమాను నిషేధించింది! దీని గురించి పాకిస్తానీ చిత్ర పంపిణీదారు సతీష్ ఆనంద్ మాట్లాడుతూ, ‘అబీర్ గులాల్’ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కావడం లేదని అన్నారు. ‘ ఈ సినిమాలో ఒక భారతీయ హీరోయిన్ (వాణీ కపూర్) ఉండటం వల్లే ఆ సినిమాను విడుదల చేయడానికి అనుమతి లేదు’ అని ఆయన అన్నారు. ‘విడుదల సమయం సరిగా లేకపోవడం వల్ల, సినిమా నిర్మాతలు పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు’ అని ఆయన అన్నారు. మొత్తానికి ‘అబీర్ గులాల్’ సినిమా పాకిస్తానీ నటుడు నటించినందుకు భారతదేశంలోనూ, భారతీయ నటి నటించినందుకు పాకిస్తాన్‌లోనూ నిషేధానికి గురైంది.

వాణి కపూర్

ఫహద్ ఖాన్ ఒక పాకిస్తానీ సినీ నటుడు. గతంలో పలు భారతీయ చిత్రాలలో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. అంతేకాదు ఫహద్ ఖాన్ కు పాకిస్తానీ టీవీ సీరియల్స్‌లోనూ నటించాడు. ఫహద్ ఖాన్ పాకిస్తానీ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అతను నటించిన ‘మౌలా జాట్’ చిత్రం కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్‌తో పాటు భారతదేశంలో కూడా విడుదలైంది. ఫహద్ ఖాన్ తప్ప ‘అబీర్ గులాల్’ సినిమాలోని ఇతర నటులు, నటీమణులందరూ భారతీయులే. కానీ ఆ సినిమాలో ఫహద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించడం వల్ల ఆ సినిమాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రంలో వాణి కపూర్ కథానాయికగా నటించింది. ఆర్తి ఎస్. బగాడి దర్శకత్వం వహించారు.ఫహద్ ఖాన్ చివరిగా నటించిన భారతీయ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’. అప్పుడు కూడా, పాకిస్తానీ నటుడిని ఎంపిక చేయడంపై వివాదం చెలరేగింది. ఆ తర్వాత పాకిస్తాన్ నటులు భారతీయ చిత్రాలలో నటించకుండా నిషేధం విధించారు. కానీ ఈ నిషేధాన్ని 2023లో ఎత్తివేశారు. అంతే కాదు, ఈ సంవత్సరం భారతదేశంలో పాకిస్తానీ సినిమాలు విడుదల కావడంపై నిషేధాన్ని కూడా ఎత్తివేశారు. ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది.

Read Also :Actress: కాస్టింగ్ కౌచ్‌పై రీతూ చౌద‌రి సంచ‌ల‌న కామెంట్స్

#AbeerGulalBan #BollywoodControversy #FahadKhan #IndiaBan #PakistanBan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.