ఒకదేశంలో ఉగ్రదాడులు జరిగితే ఆ ప్రభావం ఇతర అంశాలపై కూడా ఉంటుంది. క్రీడాకారులు, రాజకీయనేతలు, సినీప్రముఖులు ఇలా ప్రఖ్యాతిగాంచిన వారు ఆ దేశాల్లో పర్యటించేందుకు వెనుకడుగు వేస్తారు. భద్రతపరమైన సమస్యలు, ఇబ్బందులకు గురికావడం ఎందుకనే భావనతో ఆ పర్యటనలను రద్దు చేసుకుంటారు. ఇటీవల దేశరాజధాని న్యూఢిల్లీలోని (New Delhi) ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు (Delhi Blast) ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Also: CCI Rules: పత్తి రైతులను పరేషాన్ చేస్తున్న సిసిఐ రూల్స్
దీంతో డిసెంబరు నెలలో భారతదేశంలో పర్యటించాల్సిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు(Benjamin Netanyahu) మరోసారి వాయిదా పడింది. పలు కారణాలతో ఇలా వాయిదా పడడం ఇది మూడోసారి. తాజాగా ఢిల్లీ బ్లాస్ట్ కారణంగా భద్రతాపరమైన సమస్యలతో వాయిదా పడినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
సెప్టెంబరు, ఏప్రిల్ పర్యటన వాయిదా
మొదట నెతన్యాహు సెప్టెంబరు 9న భారత్ లో పర్యటించాల్సి ఉండగా అది రద్దు అయింది. దీంతో సెప్టెంబరు 17న ఇజ్రయెల్ పార్లమెంట్ లో జరిగిన ఓటింగ్ కారణంగా రద్దు అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా ఇదే మాదిరి వాయిదా పడింది. తాజాగా ఢిల్లీ బాంబు పేలుడుతో వాయిదా పడింది. వచ్చే ఏడాది కొత్త తేదీని కోరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నెతన్యాహు 2018 జనవరిలో భారతదేశాన్ని సందర్శించారు. నెతన్యాహు-మోడీల మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: