📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indian Students: విదేశాలకు తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

Author Icon By Vanipushpa
Updated: April 17, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో పోలిస్తే ఇదే తొలిసారి. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకేల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్‌ వీసాల్లో 25శాతం తగ్గుముఖం పట్టాయి.
తగ్గిన 32శాతం భారతీయ విద్యార్థులు
కెనడాకు వెళ్లేవారి భారతీయ విద్యార్థుల సంఖ్యలో 32శాతం తగ్గింది. ఇది 2.78లక్షల నుంచి 1.89 లక్షలకు చేరుకొంది. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్‌, రెఫ్యూజీస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ కెనడా సంస్థ వెల్లడించింది. ఇక అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం పడిపోయింది. దీంతో 2024లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఎఫ్‌1 వీసాల్లో 1,31,000 నుంచి 86,000కు తగ్గుదల కనిపించింది. యూకేకు వెళ్లే వారి సంఖ్యలో 26శాతం తగ్గుదల నమోదైంది. అంతకు ముందు ఏడాది 1,20,000 విద్యార్థి వీసాలు ఉండగా, తాజాగా యూకే హోమ్‌ ఆఫీస్‌ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 88,732కు తగ్గాయి.

కెనడా- భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు
ముఖ్యంగా కెనడా, యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించాయి. ఈ పరిస్థితే కారణంగా నిలిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కెనడా- భారత్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా కారణమయ్యాయి. ఆ దేశంలో భారతీయ విద్యార్థులపై పలు ఆంక్షలు విధించడం, స్టూడెంట్‌ డైరెక్ట్‌ స్ట్రీమ్‌ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేయడమే కాకుండా, తమ దేశంలో తాత్కాలికంగా నివశించే విదేశీయు సంఖ్యను 2026 నాటికి 5 శాతానికి తగ్గించాలన్న నిర్ణయం కూడా వీసాల తగ్గుముఖం ప్రభావం పడింది. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం వల్ల గృహ, ఆరోగ్య, ఇతర ప్రజాసేవలకు భారంగా మారుతోందన్న కెనడా, భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32శాతం తగ్గించింది. అదే సమయంలో చైనీయులకు కేవలం 3శాతానికే కుదించింది.
2023 నుంచే భారతీయులకు తగ్గించిన వీసాలు
ఇక యూకే కూడా విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపద్యార్థి డిన తమ దేశానికి తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈ కారణం వల్ల ఆ దేశానికి వీసాకు దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గింది. వాస్తవానికి కొవిడ్‌ తర్వాత 2023 నుంచే భారతీయులకు విద్యార్థి వీసాలు ఇవ్వడం తగ్గిస్తూ వచ్చింది. ఆ ఏడాది 13 శాతం తగ్గుదల కనిపించింది. 2024కి వచ్చేసరికి అది 26శాతానికి పరిమితమైంది.

రాజకీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో. భారతీయ విద్యార్థులపై ఆంక్షలు, స్క్రూటినీ పెరిగింది.
గృహ అవసరాలు, హెల్త్‌కేర్, ప్రజాసేవలపై భారం పెరగడం వల్ల, కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలన్న నిష్కర్షకు వచ్చింది. భారతీయులకు 32% స్టడీ పర్మిట్లు తగ్గించగా,
చైనీయులకు కేవలం 3%కే వీసాలు ఇచ్చారు.

అమెరికా: 34% వీసా రద్దులు
2023లో: 1,31,000 ఎఫ్1 వీసాలు, 2024లో: 86,000 మాత్రమే, 34% తగ్గుదలవీసా ప్రాసెసింగ్ పై ఖచ్చిత నియంత్రణలు, రాజకీయ కారణాల వల్ల ఆధారపడి వచ్చే కుటుంబ సభ్యులకు కూడా అవకాశం తగ్గింపు కారణంగా కనిపిస్తోంది.

Read Also: US Homeland: హార్వర్డ్‌కి అమెరికా హోంల్యాండ్ శాఖ పెద్ద షాక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Declining number of Indian students Google News in Telugu Latest News in Telugu Paper Telugu News studying abroad Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.