📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Tariq Parveen: దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు తారిఖ్ పర్వీన్‌కు బెయిల్

Author Icon By Vanipushpa
Updated: May 15, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Davood Ibrahim)కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన తారిఖ్ పర్వీన్‌(Tariq Parveen) కు బాంబే హైకోర్టు (Mumbai High Court) ఊరట కల్పించింది. 2020 నాటి దోపిడీ కేసుకు సంబంధించి ఐదేళ్లకు పైగా విచారణ ఖైదీగా జైలులో మగ్గుతున్న అతడికి షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. విచారణ పూర్తికాకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

Tariq Parveen: దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు తారిఖ్ పర్వీన్‌కు బెయిల్

ఇప్పటికే ఐదేళ్లుగా జైలు జీవితం
జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని ధర్మాసనం మే 8న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తారిఖ్ పర్వీన్ ఇప్పటికే ఐదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడని, సమీప భవిష్యత్తులో విచారణ ముగిసే అవకాశాలు కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. “విచారణ ఖైదీని ఇంత సుదీర్ఘకాలం జైలులో నిర్బంధించడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన వేగవంతమైన విచారణ హక్కును ఉల్లంఘించడమే అవుతుంది” అని కోర్టు స్పష్టం చేసింది. విచారణ పూర్తికాకుండా ఒక వ్యక్తిని ఎక్కువ కాలం జైలులో ఉంచడం అనేది, విచారణకు ముందే శిక్ష విధించినట్లు (సరోగసీ పనిష్మెంట్) అవుతుందని, ఇది ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది.
హైకోర్టును ఆశ్రయంచిన తారిఖ్ పర్వీన్‌
2020 ఫిబ్రవరి 9న తారిఖ్ పర్వీన్‌ను దోపిడీ ఆరోపణలపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకా), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) లోని కఠినమైన నిబంధనల కింద అరెస్టు చేశారు. ప్రత్యేక మోకా కోర్టు బెయిల్ నిరాకరించడంతో పర్వీన్ హైకోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘకాలంగా జైలులో ఉండటం, విచారణ పూర్తికాకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించాడు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మహాలక్ష్మి గణపతి పర్వీన్ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. పర్వీన్ ఈ కేసులో ప్రధాన నిందితుడని, వ్యవస్థీకృత నేర ముఠాలో భాగమని వాదించారు. “ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే అతడు మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే లేదా సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని” ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పర్వీన్ నేర చరిత్ర, అతడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విచారణకు ముందు సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచడాన్ని తప్పుబట్టింది. “నిరూపించబడే వరకు నిందితుడు నిర్దోషి అనేదే క్రిమినల్ న్యాయశాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలలో ఒకటి. ఐదేళ్లకు పైగా విచారణ ఖైదీ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఈ సూత్రాన్ని తేలికగా తీసుకోలేము” అని జస్టిస్ జాదవ్ వ్యాఖ్యానించారు.

నేరంలో పర్వీన్ ప్రమేయాన్ని విచారణ సమయంలో తగిన సాక్ష్యాధారాల మూల్యాంకనం తర్వాత నిరూపించవచ్చని, ఒకవేళ దోషిగా తేలితే అతను తగిన శిక్షను ఎదుర్కొంటాడని కోర్టు పేర్కొంది. “ప్రస్తుత ప్రాథమిక దశలో, కేవలం సుదీర్ఘకాలంగా విచారణ పెండింగ్‌లో ఉండటం, సమానత్వ కారణాల దృష్ట్యా దరఖాస్తుదారుడి బెయిల్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని నేను భావిస్తున్నాను” అని జస్టిస్ జాదవ్ పేర్కొన్నారు. రూ. 25,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూ పర్వీన్‌ విడుదలకు అనుమతించారు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి తారిఖ్ పర్వీన్ విడుదలయ్యాడు.

Read Also: Canada Cabinet : కెనడా క్యాబినెట్లో నలుగురు భారత సంతతి నేతలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu close aide Dawood Ibrahim's Google News in Telugu granted bail Latest News in Telugu Paper Telugu News Tariq Parveen Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.