📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Darren Sammy: డారెన్ సామీకి జరిమానా విధించిన ఐసీసీ

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బార్బడోస్‌లో జరుగుతున్న క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లు నిత్యం ఆసక్తికరంగా మారుతుంటాయి. తాజాగా అక్కడ జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌ (West Indies) పై 159 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 180 పరుగులకే ఆలౌట్ కాగా, వెస్టిండీస్ కూడా 190 పరుగులే చేయగలిగింది. 10 పరుగుల ఆధిక్యం సాధించినా, ఆస్ట్రేలియా 310 పరుగులు చేసి 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండీస్ 141 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్‌లో అంపైర్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం ఆతిథ్య జట్టుకు వ్యతిరేకంగా వెళ్లాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆట కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది అంపైర్ల తీరే. ఎందుకంటే, మ్యాచ్‌లో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా వెళ్లాయి. దీనిపై కోచ్ డారెన్ సామీ తీవ్రంగా స్పందించారు.వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా (Australia) మొదటి టెస్టులో థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ 5 వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు.

నిర్ణయాలు చూసినప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయని

వీటిలో నాలుగు వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా వెళ్లాయి. కోచ్ డారెన్ సామీ విలేకరుల సమావేశంలో థర్డ్ అంపైర్ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని తర్వాత ఐసీసీ డారెన్ సామీకి శిక్ష విధించింది.తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమకు వ్యతిరేకంగా వెళ్లిందని విలేకరుల సమావేశంలో అంపైర్ పేరును ప్రస్తావిస్తూ డారెన్ సామీ (Darren Sammy) పేర్కొన్నారు. ఈ జట్టుకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చూసినప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు. డారెన్ సామీతో పాటు కెప్టెన్ రాస్టన్ ఛేజ్ కూడా ప్రశ్నలు లేవనెత్తారు.ఐసీసీ డారెన్ సామీకి డీమెరిట్ పాయింట్ విధించడంతో పాటు ఆయన మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానాగా విధించింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్‌కు కూడా మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. పాట్ కమిన్స్‌ను ఔట్ చేసిన తర్వాత కొన్ని సైగలు చేసినందుకు ఆయనకు ఈ శిక్ష విధించారు.

Darren Sammy:

థర్డ్ అంపైర్ ఒకటి కాదు అనేక వివాదాస్పద నిర్ణయాలు

వెస్టిండీస్ కెప్టెన్ రాస్టన్ ఛేజ్ కూడా అంపైర్ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు తప్పు చేస్తే శిక్ష పడుతుంది కానీ అంపైర్‌కు ఏమీ కాదని అన్నారు. నిజానికి ఒక నిర్ణయం ఛేజ్‌కు వ్యతిరేకంగా కూడా వచ్చింది. టెస్టు రెండో రోజు పాట్ కమిన్స్ (Pat Cummins) అతడిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశారు. కానీ ఛేజ్ దీనిపై డీఆర్ఎస్ తీసుకున్నాడు. అల్ట్రా ఎడ్జ్‌లో‌ బంతి బ్యాట్ కు దగ్గరగా ఉన్నప్పుడు కొంత స్పైక్ ఉన్నట్లు చూపించినప్పటికీ థర్డ్ అంపైర్ అతడిని ఔట్‌గానే ఇచ్చారు.ఈ టెస్టులో థర్డ్ అంపైర్ ఒకటి కాదు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి రోజున ట్రావిస్ హెడ్ (Travis Head) బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ షాయ్ హోప్ వద్దకు వెళ్ళింది. ఈ క్యాచ్‌ను పరిశీలించినప్పుడు థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చారు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో అలెక్స్ కారీ షాయ్ హోప్ క్యాచ్‌ను ఒక చేత్తో పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌ను పరిశీలించమని అంపైర్ థర్డ్ అంపైర్‌ను కోరగా, అతను అవుట్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో క్యాచ్ తీసుకునేటప్పుడు బంతిలో కొంత భాగం గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది.

Read Also: IND vs ENG: శుభమన్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి ఏమన్నారంటే?

#AustraliaWins #AUSvsWI #BarbadosTest #DarrenSammy #TestCricket Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.