అధికారులు ఆ గోడను బద్దలు చేసినప్పుడు, దాని వెనుక వారికో రహస్య కారాగారం కనిపించింది. బయటి ప్రపంచానికి కనిపించకుండా, ఈ జైలు ద్వారాన్ని హడావుడిగా ఇటుకరాళ్లతో గోడలా కట్టేశారు. మీర్ అహ్మద్ బిన్ ఖాసీంతోపాటు మరికొందరు ఈ జైలు గురించి గుర్తు చేయకపోయినట్లయితే ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రహస్య జైలును విచారణాధికారుల బృందం బహుశా ఎన్నడూ చూసి ఉండేది కాదేమో. పదవీచ్యుతురాలైన షేక్ హసీనాను విమర్శించిన ఖాసీం 8 ఏళ్లు ఈ జైలులో గడిపారు. జైలులో ఆయన ఎక్కువ కాలం కళ్లకు గంతలతోనే ఉన్నారు. దీంతో ఆయన తన పరిసరాల నుంచి వచ్చే శబ్దాలను గమనించేవారు. ప్రత్యేకించి విమానాలు దిగే శబ్దం ఆయనకు స్పష్టంగా గుర్తుండిపోయింది. ఇదే విచారణా బృందాన్ని విమానాశ్రయంలోని సైనిక స్థావరం వైపు నడిపించింది.
‘కాలు బయటపెట్టాలంటే భయం’
కిందటి ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన భారీ ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత ఈ జైలులోని బందీలను విడుదల చేశారు. విచారణాధికారులు ఖాసీంలాంటి వందలాదిమంది బాధితులతో మాట్లాడారు. ఇక్కడ అనేకమందిని అన్యాయంగా చంపేశారని బాధితులు కొందరు ఆరోపించారు. ఢాకా విమానాశ్రయం నుంచి రోడ్డుపై ఉన్న జైళ్లతో సహా రహస్య జైళ్లను నడుపుతున్న వ్యక్తులు ఎక్కువగా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) అనే ఉగ్రవాద నిరోధక విభాగానికి చెందినవారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
హసీనా నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తారు
వీరు నేరుగా హసీనా నుంచి వచ్చే ఆదేశాలను పాటించేవారని విచారణాధికారులు చెప్పారు. ” చాలామంది గల్లంతుకావడం అనేది ప్రధాని అనుమతి లేదా ఆదేశాలతోనే జరిగాయని సంబంధిత అధికారులు చెప్పారు” అని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం చెప్పారు.
అయితే తమకు తెలియకుండానే ఈ నేరాలు జరిగాయని, దీనికి ఎలాంటి బాధ్యత లేదని, సైనిక వ్యవస్థ సొంతంగా పనిచేస్తోందని హసీనా పార్టీ చెబుతోంది . కానీ, ఈ ఆరోపణను సైన్యం తోసిపుచ్చింది. ఏడు నెలల తరువాత, ఖాసీం ఇతరులు విడుదలయ్యారు. కానీ తమను బంధించినవారు ఇప్పటికీ సైన్యంలో కొనసాగుతుండటంతో వారు భయపడుతున్నారు.
కానీ తనను బంధించిన చిన్నగదిని వివరంగా చూపేందుకు ఆయన మొదటిసారి మీడియాను తీసుకువెళ్లారు. ఆ గది ఎంత చిన్నదో టార్చ్‌లైట్ వెలుగులో తెలుస్తోంది. ఓ మనిషి కనీసం నిటారుగా నిలబడటానికి వీలులేదు. గదంతా కంపు కొడుతోంది. కొన్ని గోడలు పడిపోయాయి.
వేసవిలో భరించలేనంత వేడి
ఖాసీం తాను గడిపిన సెల్‌లో సన్నని నీలిరంగు టైల్స్ చాలా స్పష్టంగా గుర్తున్నాయి. అందుకే విచరాణాధికారులు నేరుగా అక్కడకు వెళ్లగలిగారు. ఇప్పడా నీలిరంగు టైల్స్ ముక్కలైపోయి ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లోని గదులతో పోలిస్తే, ఇది చాలా పెద్దది, 10 x 14 అడుగులు (3 మీ x 4.3 మీ). ఒక వైపు మరుగుదొడ్డి ఉంది. బందీగా ఉన్నప్పుడు తాను అక్కడ ఎలా గడిపిందీ ఖాసీం గదిలో తిరుగుతూ వివరించారు.
ఎప్పటికీ బయటపడలేననుకున్నా
చాలా సందర్భాలలో తమను కొట్టి చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఏదో ఒకరోజు తాము రోడ్డుమీద నడుస్తున్నప్పుడో, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడో, తమను బంధించినవారు కనపడతారనే భయం దాదాపు ప్రతివారిలోనూ కనిపించింది. ”నేను కారు ఎక్కినప్పుడల్లా, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎక్కడున్నానో తలుచుకుంటే భయం వేస్తుంటుంది.” అని 35 ఏళ్లు అతికుర్ రెహ్మాన్ రస్సెల్ చెప్పారు.
Read Also: Trade War: చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్