📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Covid: ఆసియాలో మళ్లీ కోవిడ్ అలజడి.. పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు

Author Icon By Anusha
Updated: May 16, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరోనా వైరస్ మరోసారి ఆసియాలోని పలు దేశాల్లో పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్‌ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది.హాంగ్‌కాంగ్‌లో ప్రస్తుతం వైరస్ కేసులు ‘చాలా ఎక్కువగా’ ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్(Albert) స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంకాంగ్‌(Hong Kong)లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలుతున్న వారి శాతం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది. మే 3తో ముగిసిన వారంలో తీవ్రమైన కేసులు, మరణాలు కూడా దాదాపు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరి 31గా నమోదయ్యాయని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్(Center for Health Protection) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండేళ్లలో చూసినంత తీవ్రస్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ,కోవిడ్ సంబంధిత వైద్య సంప్రదింపులు, ఆసుపత్రులలో చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో వైరస్ చురుకుగా వ్యాపిస్తోందని సూచిస్తున్నాయి.

రోగనిరోధక శక్తి

ఆసియా ఆర్థిక కేంద్రంగా పేరొందిన సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. నగర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో అంతకుముందు ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200కు చేరింది. రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా సుమారు 30 శాతం పెరిగాయి. సాధారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు మాత్రమే సింగపూర్ ఆరోగ్య శాఖ(Singapore Department of Health) వివరాలను వెల్లడిస్తుంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు మహమ్మారి సమయంలో ఉన్నంత వేగంగా వ్యాపించేవి లేదా మరింత తీవ్రమైనవి అనడానికి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.గత కొన్ని నెలలుగా ఆసియా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఈ రెండు ప్రధాన నగరాల్లో ఆందోళన కలిగిస్తోంది. టీకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవారు బూస్టర్ డోసులు వేసుకోవాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా క్రియాశీలంగా ఉండే ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగా కాకుండా, ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ప్రవేశిస్తున్న తరుణంలో కోవిడ్ మళ్లీ విజృంభించడం, అధిక ఉష్ణోగ్రతలలో కూడా వైరస్ పెద్ద సంఖ్యలో ప్రజలను అనారోగ్యానికి గురిచేయగలదని స్పష్టం చేస్తోంది.

Covid: ఆసియాలో మళ్లీ కోవిడ్ అలజడి

పాజిటివిటీ

హాంగ్‌కాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఈ వారం చివర్లో తైవాన్‌లోని కాయోషియంగ్‌లో జరగాల్సిన తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని కచేరీ నిర్వాహకులు చైనా సోషల్ మీడియా వేదిక వీబోలో గురువారం తెలిపారు. చైనాలో కూడా గత ఏడాది వేసవిలో నమోదైన గరిష్ఠ స్థాయికి కోవిడ్ కేసులు చేరే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(Chinese Center for Disease Control and Prevention) గణాంకాలు సూచిస్తున్నాయి. మే 4తో ముగిసిన ఐదు వారాల్లో దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో రోగ నిర్ధారణ కోసం వచ్చిన రోగులలో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువైంది. థాయ్‌లాండ్‌లో ఈ ఏడాదిఏప్రిల్‌లో జరిగిన వార్షిక సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయని ఆ దేశ వ్యాధి నియంత్రణ విభాగం నివేదించింది.

Read Also: Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే

#AsiaAlert #COVID19 #HealthWarning #HongKong #Singapore Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.