हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Yoon Suk Yeol: ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని తొలగించిన కోర్టు

Vanipushpa
Yoon Suk Yeol: ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని తొలగించిన కోర్టు

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో దేశంలో మార్షియ‌ల్ చ‌ట్టాన్ని ప్ర‌యోగించిన నేప‌థ్యంలో.. అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అభిశంస‌న‌కు గుర‌య్యారు. ఆ త‌ర్వాత జైలుపాలై రిలీజ‌య్యారు.

ద‌క్షిణ‌కొరియా దేశాధ్య‌క్షుడిని తొలగించిన కోర్టు

అభిశంస‌న‌లో ఓడిన ప్రెసిడెంట్ యూన్‌
సియోల్: అభిశంస‌న‌కు గురైన ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌ ను తొల‌గిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో దేశంలో మార్షియ‌ల్ చ‌ట్టాన్ని ప్ర‌యోగించిన నేప‌థ్యంలో.. అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై పార్ల‌మెంట్‌లో అభిశంస‌న జ‌రిగింది. అయితే అభిశంస‌న‌లో ఓడిన ప్రెసిడెంట్ యూన్‌ను ఆఫీసు నుంచి త‌ప్పిస్తూ ఇవాళ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మ‌రో 60 రోజుల్లో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు
మ‌రో 60 రోజుల్లో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ్యాంగ కోర్టు తాత్కాలిక చీఫ్ మూన్ యుంగ్ బే ఇచ్చిన ఆదేశాల‌ను జాతీయ టీవీల్లో ప్ర‌సారం చేశారు. దీంతో ప్ర‌జ‌లు సంబ‌రాల్లో తేలారు. యూన్‌పై అభిశంస‌న‌ను 8 మంది స‌భ్యులున్న రాజ్యాంగ కోర్టు బెంచ్ స‌మ‌ర్థించింది.
దక్షిణ కొరియాలో పెను సంక్షోభాన్ని సృష్టించింది
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్ ను జైల్లో వేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న గ‌త నెల‌లో జైలు నుంచి విడుదలయ్యారు. దేశ రాజధాని సియోల్‌లోని న్యాయస్థానం ఆయన అరెస్టును రద్దు చేసిన నేపథ్యంలో యూన్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. గత డిసెంబరులో స్వల్పకాలం పాటు సైనిక పాలన విధిస్తూ యూన్‌ వెలువరించిన ఆదేశాలు దక్షిణ కొరియాలో పెను సంక్షోభాన్ని సృష్టించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870