📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nigeria: నైజీరియా యూనివర్సిటీలో డ్రెస్ కోడ్ తనిఖీ వివాదం

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నైజీరియా(Nigeria)లోని ఓ యూనివర్సిటీ(Unversity)లో పరీక్షా హాలులోకి ప్రవేశిస్తున్న విద్యార్థినులు బ్రా (లో దుస్తులు) ధరించారో లేదోనని వారిని తాకుతూ చెక్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో వర్సిటీ తీరుపై విమర్శలు రేగాయి. నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో ఒలాబిసి ఒనాబాంజో(Olabisi onabanjo) యూనివర్సిటీలోని పరీక్ష హాలులోకి వస్తున్న కొంతమంది విద్యార్థినులను, వారి ఛాతీ ప్రాంతాన్ని మహిళా సిబ్బంది తాకుతూ తనిఖీలు చేస్తున్నట్టు ఆ వీడియో ఫుటేజీలో ఉంది. ఆ వీడియోపై యూనివర్సిటీ స్పందించలేదు.

కానీ, యూనివర్సిటీలో అమలవుతున్న డ్రెస్‌కోడ్‌లోని ఈ లోదుస్తుల నిబంధన, విద్యాసంస్థ వాతావరణాన్ని స్వేచ్ఛగా ఉంచాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్నట్టు ఓ విద్యార్థినేత తెలిపారు. అయితే ఈ విధానాన్ని అనాగరికం, లైంగిక దాడిగా విమర్శకులు ఖండిస్తుండటంతో, దీనిని అమలు చేయడానికి మెరుగైన పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఓగున్ రాష్ట్రంలోని ఒలాబిసి ఒనాబాంజో యూనివర్సిటీ లో, పరీక్షల సందర్భంగా విద్యార్థినుల లో దుస్తుల (బ్రా) ధరించారా లేదా అనే కోణంలో శారీరక తనిఖీలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో మహిళా సిబ్బంది విద్యార్థినుల ఛాతీ ప్రాంతాన్ని తాకుతూ తనిఖీ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.

Nigeria: వివాదాన్ని రేపుతున్న వర్సిటీ లోదుస్తుల నిబంధన

హక్కులను ఉల్లంఘించేలా చేసే వర్సిటీపై కేసు
తమ హక్కులను ఉల్లంఘించేలా ప్రవర్తించినందుకు వర్సిటీపై విద్యార్థులు కేసు పెట్టవచ్చని హ్యూమన్ రైట్స్ నెట్‌వర్క్‌ క్యాంపెయిన్ గ్రూపులోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. “ఇతరుల శరీరాన్ని అనవసరంగా తాకడం ఉల్లంఘనే అవుతుంది.అది చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చు. అసభ్యకరమైన వస్త్రధారణను అరికట్టడానికి విశ్వవిద్యాలయం ఈ పద్ధతిని అనుసరించడం తప్పు” అని హరుణ అయాగి అన్నారు. వర్సిటీ మతపరమైన సంస్థ కాకపోయినా, కఠినమైన నైతిక నియామవళిని అమలు చేస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విద్యార్థి తెలిపారు. ‘‘వారికి మత సంబంధం లేనప్పటికీ, మతపరమైన నియమాల్లా డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు’’ ‘‘పరీక్షకు వెళ్లే ప్రతీసారీ శారీరక తనిఖీ అనేది అపమానకరం, భయానకమైన అనుభవం’’
డ్రెస్ కోడ్ లక్ష్యం
విమర్శల నేపథ్యంలో ”గౌరవప్రదమైన, స్వేచ్ఛాయుత వాతావరణం దెబ్బతినకుండా సంస్థ విలువలకు అనుగుణంగా విద్యార్థినుల వస్త్రధారణ హుందాగా ఉండేలా చూడటమే డ్రెస్ కోడ్ లక్ష్యం” అని యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేత మయిజ్ ఒలాతుంజీ ఎక్స్‌లో చెప్పారు. ‘‘ఈ విధానం కొత్తది కాదు. అసభ్య వస్త్రధారణను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించేలా విద్యాసంస్థతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులు, సిబ్బంది మధ్య గౌరవంగా, హుందాగా సంభాషణలు కొనసాగడంపై దృష్టి సారించాం” అని ఆ పోస్టులో రాశారు. దీంతోపాటు వస్త్రధారణ కోడ్‌ను కూడా అందులో ప్రచురించారు.

Read Also: Warning: అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu controversial dress code Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today varsity underwear rule

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.