📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Gaza: గాజాలో పరిస్థితులు దారుణం : ఐసీఆర్‌సీ చీఫ్

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజాలో పరిస్థితులు నరకం కంటే దారుణంగా ఉన్నాయని ‘ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్‌ ది రెడ్ క్రాస్(ఐసీఆర్‌సీ)’ ‌చీఫ్ చెప్పారు. గాజా(Gaza)లో జరుగుతున్న దారుణాలను గమనించాక “మానవత్వం విఫలమవుతోంది” అని ఐసీఆర్‌సీ(ICRC) అధ్యక్షురాలు మీర్యానా స్పోల్జారిక్ చెప్పారు. ఏప్రిల్‌లో ఆమె గాజాలో పరిస్థితులను “భూమి మీద నరకం” అని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ‘‘మీరు ఈ మాట అన్న తరువాత మీ ఆలోచనను మార్చే పరిణామం ఏదైనా అక్కడ జరిగిందా?’’ అని ప్రశ్నించా. “పరిస్థితి మరింత దారుణగా మారింది. అక్కడ జరుగుతున్న దాన్ని మేం చూడలేక పోతున్నాం. అక్కడి విధ్వంసం, వాళ్లు అనుభవిస్తున్న బాధ ఆమోదయోగ్యమైన, చట్టపరమైన, నైతికపరమైన, మానవీయ ప్రమాణాలను దాటిపోయింది”. “మరీ ముఖ్యంగా, మనం గౌరవం పూర్తిగా కోల్పోయిన ప్రజలను చూస్తున్నాం. ఇది నిజంగా మనందరినీ కలచివేయాలి” అని ఆమె చెప్పారు. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయించేందుకు, పాలస్తీనీయన్ల కష్టాలను ముగించేందుకు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని తప్పనిసరిగా ఆపాలని ఆమె కోరారు. ఐసీఆర్‌సీ అధ్యక్షురాలు తన పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకున్నారు. అవి నైతికంగా చాలా బలమైనవి.

Gaza: గాజాలో పరిస్థితులు దారుణం : ఐసీఆర్‌సీ చీఫ్

ఆత్మ రక్షణకే గాజాలో దాడులు
ఐసీఆర్‌సీ ప్రపంచ మానవీయ సంస్థ. ఒకటిన్నర శతాబ్దాలుగా ఈ సంస్థ యుద్ధాలలో ప్రజల బాధలను తగ్గించడానికి కృషి చేస్తోంది. ఈ సంస్థ జెనీవా ఒప్పంద సంరక్షకురాలు కూడా. ఈ ఒప్పందం యుద్ధం జరుగుతున్నప్పుడు పౌరులను రక్షించేందుకు ఉద్దేశించినది. వీటిని ఎవరు పాటిస్తున్నారో చూసే బాధ్యత ఈ సంస్థది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పౌరుల మారణ హోమం జరగకుండా 1949లో ఓ కొత్త ఒప్పందాన్ని తీసుకొచ్చారు. ఆత్మ రక్షణకే గాజాలో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెప్పిన విషయాన్ని నేను ఆమెకు గుర్తు చేశాను. దీనిపై ఆమె స్పందిస్తూ “ప్రతి దేశానికి తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని” చెప్పారు.
పిల్లలను ఆహారం, ఆరోగ్యం, భద్రతకు దూరం చేయవద్దు
“తన బిడ్డలు సురక్షితంగా ఉండేలా చూసే హక్కు ప్రతి తల్లికి ఉంటుంది. బందీలను తీసుకెళ్లడం ఏ మాత్రం క్షమించరానిది. అలాగే పిల్లలను ఆహారం, ఆరోగ్యం, భద్రతకు దూరం చెయ్యడం కూడా క్షమించరానిది. ప్రతి యుద్ధంలో శత్రువుల పట్ల వ్యవహరించాల్సిన నియమాలు అమల్లో ఉన్నాయి” అని ఐసీఆర్‌సీ అధ్యక్షురాలు చెప్పారు. అంటే 2023 అక్టోబర్ 7న హమాస్, ఇతర సాయుధ పాలస్తీనియన్లు 1200 మందిని హత్య చేయడం, 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం, ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ధ్వంసం చేయడం 50వేల మంది పాలస్తీనీయులను చంపేయడాన్ని సమర్థించవచ్చా?
మీ పిల్లవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవచ్చు, అతనికి ఇలాంటి రక్షణ అవసరం వస్తుందేమో అనే విషయం మీకు కూడా తెలియదు” అని ఆమె అన్నారు.
గాజాలోకి అంతర్జాతీయ వార్తా సంస్థలకు అనుమతి లేదు
గాజాలో పరిణామాల గురించి ఐసీఆర్‌సీ ఇచ్చే సమాచారానికి విశ్వసనీయత ఉంది. ఇజ్రాయెల్ గాజాలోకి అంతర్జాతీయ వార్తా సంస్థలను అనుమతించడం లేదు. జర్నలిస్టులను ఆ ప్రాంతంలోకి రానీయడం లేదు. గాజాలో 300కి పైగా ఐసీఆర్‌సీ సిబ్బంది రిపోర్టింగ్ చేస్తున్నారు. వారిలో 90శాతం మంది పాలస్తీనీయన్లు. యుద్ధంలో ముఖ్యమైన ఘటనలను వారు రికార్డు చేస్తున్నారు.
గాజాలో ఉన్న తమ టీమ్ లీడర్‌తో మీర్యానా స్పోల్జారిక్ ప్రతి రోజూ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా మద్దతున్న గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ రఫాలో సహాయ సామగ్రి పంపిణీ చేస్తున్న సమయంలో అనేకమంది పాలస్తీనియన్లు మరణించిన ప్రాంతానికి ఐసీఆర్‌సీ నిర్వహిస్తున్న ఆసుపత్రి సమీపంలోనే ఉంది. ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం, యుద్ధం, అమానవీయ పరిస్థితుల గురించి ఐసీఆర్‌సీ ఆందోళన చెందుతున్నట్లు స్పోల్జారిక్ చెప్పారు.


Read Also: Tharoor: అమెరికాలో ప్రెస్ మీటింగ్‌లో థరూర్‌కు తన కుమారుడి కఠిన ప్రశ్న

: ICRC chief #telugu News Ap News in Telugu Breaking News in Telugu Conditions Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.