📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Megha Vemuri: మేఘా వేమూరిపై కాలేజ్ బ్యాన్

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 4:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘా వేమూరి.. ఇప్పుడు స్థానిక మీడియా దగ్గరినుంచి అంతర్జాతీయ మీడియా(International Media) వరకు ఈ అమ్మాయి గురించే వార్తలు రాస్తున్నాయి. ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యూయేషన్ కార్యక్రమంలో మేఘా(Megha) పాలస్తీనా(Palastina)కు మద్దతుగా మాట్లాడింది. తాను చదివిన కాలేజీపైనే కామెంట్లు చేసింది. దీంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని కార్యక్రమం నుంచి ఇంటికి పంపేశారు. మేఘా స్పీచ్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్‌లో నిలిచిన మేఘ ఎవరు.. ఎమ్ఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆమె ఏం మాట్లాడింది..

Megha Vemuri: మేఘా వేమూరిపై కాలేజ్ బ్యాన్

ఇండో అమెరికన్ అమ్మాయి
మేఘా వేమూరి ఇండో అమెరికన్ అమ్మాయి. ఆమె జార్జియా, అల్ఫారెట్టాలో జన్మించింది. జార్జియాలోని అల్ఫారెట్టా హైస్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఎమ్ఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్‌లో తాజాగా డిగ్రీ పూర్తి చేసింది. ఆమె ఎమ్ఐటీ క్లాసు ప్రెసిడెంట్ కూడా.
ఎమ్ఐటీ కార్యక్రమంలో ఆమె ఏం మాట్లాడింది..
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా ఒకరకంగా నాశనం అయిపోయింది. అక్కడి ప్రజలు బాంబు దాడులతో, ఆకలి కొరతతో చనిపోతూ ఉన్నారు. ఎమ్ఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మేఘా మాట్లాడుతూ.. ‘ ఇజ్రాయెల్‌తో ఎమ్ఐటీ సంబంధాలు కలిగి ఉంది. అంటే దానర్థం.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు మన దేశంతో పాటు మన స్కూలు కూడా మద్దతు తెలుపుతున్నట్లే.. సాయం చేస్తున్నట్లే..
మేఘాపై ఛాన్సలర్ మెలిసా నోబెల్స్ మండిపాటు

పాలస్తీనాను ఈ భూమ్మీదనుంచి లేకుండా చేయడానికి ఇజ్రాయెల్ చూస్తోంది. దాన్ని మనం చూస్తూ ఉరికే ఉన్నాం. ఆ దారుణంలో ఎమ్ఐటీ భాగం అవ్వటం సిగ్గుచేటు. ఇజ్రాయెల్ మిలటరీతో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేస్తూ.. గత సంవత్సరం ఎమ్ఐటీ గ్రాడ్యుయేట్స్ బాడీ, అండర్ గ్రాడ్యుయేట్ యూనియన్ ఓట్లు వేసింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం మీరు (కాలేజీ సిబ్బంది) పిలుపునిచ్చారు. పాలస్తీనా కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచారు’ అని అంది. మేఘా పాలస్తీనాకు మద్దతుగా.. ఎమ్ఐటీపై చేసిన వ్యాఖ్యలతో యూనివర్శిటీ ఛాన్సలర్ మెలిసా నోబెల్స్ మండిపడ్డారు. మేఘాను, ఆమె కుటుంబాన్ని వెంటనే కార్యక్రమం నుంచి ఇంటికి పంపేశారు.

Read Also: Mock Drills: పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్‌ డ్రిల్స్‌

#telugu News Ap News in Telugu Breaking News in Telugu College ban on Google News in Telugu Latest News in Telugu Megha Vemuri Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.