📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Chinmoy Krishna Das: చిన్మయి కృష్ణదాస్‌ మళ్లీ అరెస్ట్..కారణం ఏమిటి ?

Author Icon By Vanipushpa
Updated: May 6, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రబోధకుడు చిన్మోయ్‌ కృష్ణదాస్‌ను మరోసారి అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీలను రక్షించాలని ఆందోళనలు చేపట్టి దేశ ద్రోహం కేసులో అరెస్టయిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌కు ఇటీవలే బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ పోలీసులు మరో కేసులో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. గతేడాది నవంబర్ 7న కోర్టు ప్రాంగణంలో న్యాయవాది సైఫుల్‌ ఇస్లాం అలీఫ్‌పై నిరసనకారులు దాడిచేసి, హత్య చేసిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చిన్మోయ్‌ కృష్ణదాస్‌కు బెయిల్ మంజూరు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వుపై అక్కడి సుప్రీం కోర్టు స్టే విధించినట్లు సమాచారం. కృష్ణదాస్‌పై నమోదైన కేసులపై వర్చువల్ విచారణ తర్వాత సోమవారం ఆయనను అరెస్ట్‌ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన కేసులపై మంగళవారం విచారణ జరగనుంది.

Chinmoy Krishna Das :చిన్మయి కృష్ణదాస్‌ మళ్లీ అరెస్ట్..కారణం ఏమిటి ?

జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌ గతేడాది నవంబరులో చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా, ఆయనపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్‌ న్యాయవాది కేసును టేకప్‌ చేయగా, ఆయనపైనా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో చిన్మయ్‌ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకురాలేదు. మైనారిటీల హక్కుల కోసం చేసిన పోరాటాల్లో భాగంగా దేశద్రోహం కేసులో ఇప్పటికే అరెస్టు అయిన ఆయనకు ఇటీవల బెయిల్ లభించిన నేపథ్యంలో, తాజాగా మరో కేసులో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

న్యాయవాది హత్యపై విచారణ

2023 నవంబర్ 7న కోర్టు ప్రాంగణంలో న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్‌పై నిరసనకారులు దాడి చేసి హత్య చేసిన ఘటనలో చిన్మయ్‌ కృష్ణదాస్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో విచారణ అనంతరం, సుప్రీం కోర్టు ఆయనను అరెస్ట్ చేయడానికి అనుమతినిచ్చింది. చివరకు చిన్మయ్‌ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్‌ జోతే అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఆయనకు ఊరట లభించింది.

ఇటీవల కృష్ణదాస్​కు బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, తాజాగా మరో కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కాగా, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన దగ్గరి నుంచి భారత్‌-బంగ్లా మధ్య సంబంధాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ చిన్మయ్‌ కృష్ణదాస్ అరెస్టు కూడా అందుకు ఓ కారణమైంది. చిన్మయ్ తరఫున వాదించేందుకు ముందుకు వచ్చిన న్యాయవాదులపై ఆందోళనకారులు దాడులు జరిపారు. ఫలితంగా కేసు వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు, సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే సంస్థ 11 మంది లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది.

Read Also: US : అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త పథకం

#telugu News Ap News in Telugu arrested again Breaking News in Telugu Chinmayi Krishnadas Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today what is the reason?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.