📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!

Author Icon By Vanipushpa
Updated: June 2, 2025 • 1:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్(Pakistan) పై భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ చైనా(China) నుంచి తెచ్చుకున్న పీఎల్-15ఈ క్షిపణిని పాకిస్తాన్ J-10C లేదా JF-17 జెట్ ద్వారా భారత్ పైకి ప్రయోగించింది. అయితే భారత్ దీన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈ క్షిపణి శిథిలాలు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని కమాహి దేవి గ్రామం సమీపంలో దొరికాయి. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన చైనా క్షిపణి పీఎల్ 15ఈని కూల్చేసిన తర్వాత వాటి శిథిలాలను పరిశీలించిన నిపుణులకు షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. పాకిస్తాన్ కు చైనా అందిస్తున్న సాయం ఏ స్ధాయిలో ఉందో అందరికీ అర్ధమైంది. అదే సమయంలో పీఎల్ 1ఈ క్షిపణిలోని ముఖ్యమైన భాగాలు, దాని ప్రొపల్షన్, డేటా-లింక్, ఇనర్షియల్ యూనిట్ , అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే సీకర్ సహా ఏవీ చెక్కుచెదరలేదని నిపుణులు తేల్చారు. దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు.

Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!

ప్రపంచ దేశాలకు ఆందోళన
చైనా క్షిపణి పీఎల్ 15ఈని భారత్ విజయవంతంగా కూల్చేసినా అందులో అమర్చిన వ్యవస్థలు మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో వీటిని అధ్యయనం చేసేందుకు భారత్ కు మంచి అవకాశం లభించింది. అదే సమయంలో భారత్ తో పాటు మరో ఏడు దేశాలు కూడా ఈ వివరాల్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఐదు కళ్ల కూటమిగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు జపాన్, దక్షిణ కొరియా కూడా ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసేందుకు తమ నిపుణులకు అవకాశం ఇవ్వాలని ఆయా దేశాలు భారత్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.

చైనా అభివృద్ధి చెందుతున్న సైనిక సాంకేతికత
చైనా పీఎల్ 15ఈ క్షిపణిలో వాడిన డ్యూయల్-పల్స్ మోటార్ , AESA టెక్నాలజీని అధ్యయనం చేయడానికి ఏడు దేశాలు యాక్సెస్ కోరుతుండంతో ఈ శిథిలాల అన్వేషణ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇది చైనా అభివృద్ధి చెందుతున్న సైనిక సాంకేతికత గురించి ప్రపంచ దేశాల ఆందోళనకు ప్రతిబింబంగా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం భారత రక్షణ శాస్త్రవేత్తలు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇందులో లభించే ఫలితాలు మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి పనికొస్తాయని భావిస్తున్నారు. అలాగే ఏడు దేశాలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాయి. మరోవైపు ఈ క్షిపణి శిథిలాలు భారత్ కు దొరకడంపై చైనా రక్షణ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: Pankhuri Mishra: మిష్రా క్షమాపణ: ‘‘నిజంగా నన్ను

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Concern over the debris fired by Pakistan at India! Google News in Telugu Latest News in Telugu of the Chinese missile Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.