📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: చైనా సంచలన నిర్ణయం.. ఎల్‌ఎన్‌జీ దిగుమతుల నిలిపివేత

Author Icon By Vanipushpa
Updated: April 18, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లకు అడ్డు అదుపు ఉండట్లేదు. ఈ విషయంలో రోజుకో కొత్త ప్రకటన జారీ చేస్తోన్నారు. టారిఫ్‌ల యుద్ధానికి తెర తీశారు. వందకు పైగా దేశాలు అమెరికా టారిఫ్‌ల రాడార్‌లోకి వెళ్లిపోయాయి. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఇప్పుడు తాజాగా చైనాపై మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో టారిఫ్ విధించారు. డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 245 శాతం మేర టారిఫ్‌ను ప్రకటించారు. ఇది- ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ట్రేడ్ వార్‌‌‌‌కు మరింత ఆజ్యాన్ని పోసినట్టయింది. పతాక స్థాయికి తీసుకెళ్లినట్టయింది.

చైనాపై అమెరికా ఆరోపణలు
ఇదివరకు అమెరికా ప్రకటించిన టారిఫ్‌కు అనుగుణంగా మొదట్లో స్పందించింది చైనా. అమెరికా దిగుమతులపై 126 శాతం వరకు టారిఫ్‌ను ప్రకటించింది రెండుదశల్లో. తొలి దశలో 35, ఆ తరువాత 86 శాతం వరకు టారిఫ్‌‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి ప్రతీకారానికి దిగింది అమెరికా. ఏకంగా 245 శాతం మే టారిఫ్‌ను విధించినట్లు తెలిపింది. ఈ మేరకు వైట్ హౌస్‌లో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఈ కొత్త టారిఫ్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది స్పష్టంగా పేర్కొనలేదు ఇందులో. రక్షణ అవసరాలు, అంతరిక్షం, సెమీకండక్టర్ పరిశ్రమల్లో వినియోగించే కీలకమైన గ్యాలియం, జెర్మేనియం, యాంటిమొనీ వంటి వస్తువులు, పదార్థాలను చైనా ఉద్దేశపూరకంగా పరిమితం చేస్తోందని అమెరికా ఆరోపించింది. చైనా ఇటీవలే ఎర్త్ మెటల్స్‌ను ఎగుమతి చేయడాన్ని నిలిపివేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది.
ట్రంప్ టారిఫ్‌తోనే చైనా ఈ నిర్ణయం
ఈ పరిణామాల మధ్య చైనా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) దిగుమతులను పూర్తిగా నిలిపివేసింది. ఎల్‌ఎన్‌జీకి సంబంధించిన ఎలాంటి షిప్‌మెంట్ కూడా గత కొన్ని రోజులుగా నమోదు కావట్లేదని షిప్ డేటా ట్రాకింగ్ కంపెనీ కెప్లెర్ వెల్లడించింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా దిగుమతి చేసుకుంటోన్న ఎల్‌ఎన్‌జీపై గతంలో 19 శాతం మేరకు టారిఫ్ ఉండేది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని సవరించారు.

30 శాతం అదనపు టారిఫ్ విధించారు. ఫలితంగా టారిఫ్ 49 శాతానికి ఎగబాకింది. ట్రంప్ విధించిన టారిఫ్‌ను దృష్టిలో ఉంచుకుని చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ గ్యాస్ రీసెర్చ్ కంపెనీ రైస్టర్డ్ ఎనర్జీ హెడ్ వీయ్ గ్ఝియాంగ్ తెలిపారు. 60 రోజులుగా చైనాకు సంబంధించి ఎల్ఎన్‌జీ షిప్ కన్‌సైన్మెంట్ కూడా రిజిస్టర్ కాలేదని అన్నారు. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని అంచనా వేశారు. ఎల్ఎన్‌జీకి ప్రత్యామ్నాయ వనరులను చైనా వెదుక్కోవచ్చని గ్ఝియాంగ్ చెప్పారు. సహజవాయు రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం లభించినట్టయిందని పేర్కొన్నారు.

Read Also: Trump : ఇటలీ ప్రధాని అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu China's sensational decision Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to halt LNG imports

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.