📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: పాకిస్తాన్‌కు చైనా మరో సాయం.. సగం ధరకే ఫైటర్ జెట్లు

Author Icon By Vanipushpa
Updated: May 21, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) భారత్ పాకిస్తాన్(Bharath-Pakistan) మధ్య వివాదాలు తారస్థాయికి చేరుతున్న వేళ.. చైనా(China) తన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్‌కు భారీగా సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత అధునాతన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలైన జే-35ఏ(J-35A) డెలివరీలను మరింత వేగవంతం చేయాలని డ్రాగన్ కంట్రీ నిర్ణయించింది. రెండు దేశాలకు చెందిన దౌత్య వర్గాలు ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్‌కు చైనా బహుమతిగా అభివర్ణిస్తున్నాయి. ఈ నిర్ణయంతో పాక్, చైనా మధ్య రక్షణ సహకారం ఎంత అత్యవసరంగా మారిందో స్పష్టం చేస్తోంది. అయితే ఈ జే-35ఏ ఫైటర్ జెట్లను పాక్‌కు అందించేందుకు చైనా అనేక ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.

China: పాకిస్తాన్‌కు చైనా మరో సాయం.. సగం ధరకే ఫైటర్ జెట్లు

50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో..
అయితే ఈ జే-35ఏ యుద్ధ విమానాలను 50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో పాకిస్తాన్‌కు చైనా అందిస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆ మిగిలిన 50 శాతాన్ని కూడా ఈఎంఐల రూపంలో చెల్లించేందుకు చైనా అంగీకరించడం గమనార్హం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చూపిన పనితీరుకు ఇది ఒక బహుమతిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాదిలోనే 30 జే-35ఏ యుద్ధ విమానాల మొదటి బ్యాచ్‌ను డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ నాటికి ఈ ఫైటర్ జెట్లు.. పాక్‌కు అందించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది.
చైనా పర్యటనలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్
ఇక ప్రస్తుతం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చైనా పర్యటనలో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి మొదటి 30 జే-35ఏ ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ అందుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత బలాన్ని చేకూర్చుకుంటున్న నేపథ్యంలో.. చైనా, పాకిస్తాన్ ఉన్నతాధికారుల మధ్య ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో భాగంగా సైనిక సహకారాన్ని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాయి.
ఫైటర్ జెట్ల ఒప్పందం
మరోవైపు.. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఇప్పటికే కొంతమంది పైలట్లు.. జే-35ఏ ఫైటర్ జెట్లను నడిపేందుకు కావాల్సిన ట్రైనింగ్ కోసం బీజింగ్‌లోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం.. ఐదో తరం ఎయిర్‌ఫోర్స్ శక్తి సామర్థ్యాలను పొందడంలో పాకిస్తాన్ సాధించిన పురోగతి అని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫైటర్ జెట్ల ఒప్పందంతో పాటు.. చైనా అధికారులు పాకిస్తాన్ సివిల్, సైనిక మౌలిక సదుపాయాల్లో 25 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు.
చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక, ఆర్థిక సహకారం
ఈ 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ఫేజ్-2 కార్యక్రమం కింద ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గ్వాదర్ పోర్ట్ కార్యకలాపాలకు పూర్తి భద్రతాపరమైన మద్దతు, సులభమైన యాక్సెస్‌ను చైనాకు అందిస్తామని పాకిస్తాన్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే.. చైనా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక, ఆర్థిక సహకారం.. ప్రాంతీయంగా ఎదురయ్యే భద్రతా సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నట్లు అర్థం అవుతోంది.

Read Also: Texas Tornado : ఉత్తర టెక్సాస్‌లో భారీ వడగళ్ల వర్షం

#telugu News Ap News in Telugu at half the price Breaking News in Telugu China's other help Fighter jets Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.