📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా

Author Icon By Anusha
Updated: June 1, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా, తైవాన్ విషయంలో మరోసారి ఉద్రిక్తత పెరుగుతోంది. అవసరమైతే సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకోడానికి సిద్ధమైంది చైనా. ఈ క్రమంలో తమదారికి ఎవరు అడ్డొచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. తైవాన్(Taiwan)తమ అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకుంటామని అమెరికా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్(Lin Jian) మండిపడ్డారు. తైవాన్ అంశాన్ని అమెరికా తెరపైకి తీసుకురావడం సముచితం కాదని స్పష్టం చేశారు. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే ‘నిప్పుతో చెలగాటం ఆడినట్టే’ అంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పటికే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన శాంగ్రిలా భద్రతా సదస్సులో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాషింగ్టన్‌కు అధికారికంగా ప్రతినిధుల ద్వారా నిరసన తెలిపినట్టు లిన్ జియాన్ తెలిపారు. ‘చైనాపై నియంత్రణకు తైవాన్ సమస్యను బేరసారాలకు పావుగా అమెరికా వినియోగించుకోరాదు. అలా అయితే నిప్పుతో చెలగాటమే’ అని పేర్కొన్నారు. అదేవిధంగా, తైవాన్‌పై సైనిక చర్య అవకాశాన్ని చైనా తేల్చి చెప్పింది, అదే సమయంలో అమరికా జోక్యాన్ని కూడా అంగీకరించబోదని స్పష్టం చేసింది.

యుద్ధానికి

సింగ్‌పూర్ భద్రతా సదస్సులో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ‘చైనా సైన్యం తైవాన్‌పై యుద్ధానికి తహతహలాడుతోంది. 2027 నాటికి తైవాన్‌ను ఆక్రమించేందుకు సిద్ధంగా ఉండాలని జీ జిన్‌పింగ్(Xi Jinping) సైన్యానికి ఆదేశించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) రోజువారీ విన్యాసాలు చేస్తూ నిజమైన యుద్ధానికి సన్నద్ధమవుతోంది’ అని అన్నారు.ఫ్రాన్స్ అధ్యక్షుడి ఇమ్యానుయేల్ మెక్రాన్ తైవాన్ పరిస్థితిని ఉక్రెయిన్(Ukraine) యుద్ధంతో పోల్చిన వ్యాఖ్యలపై కూడా చైనా తీవ్రంగా స్పందించింది. ‘తైవాన్ సమస్య చైనా అంతర్భాగానికి సంబంధించింది.ఉక్రెయిన్ యుద్ధంతో దీనికి పోలికే లేదు,ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే ఉంది. తైవాన్ అనేది చైనా అంతర్భాగమే’అని సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది. ‘ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా ఆక్రమిస్తే అంతర్జాతీయ సమాజం స్పందించకుంటే తైవాన్‌లోనూ అదే తరహా పరిస్థితి పునరావృతం కావచ్చు” అని మెక్రాన్ హెచ్చరించారు.

China: తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్న చైనా

అవకాశం

చైనా– అమెరికా మధ్య తైవాన్ అంశంపై మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తైవాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశాన్ని బహిరంగంగానే వెళ్లడిస్తుండగా అమెరికా(America) అడ్డుకట్ట వేయాలని సంకేతాలు ఇస్తోంది. దీంతో ఇండో-పసిఫిక్ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమనాలు, నౌకలను మోహరించడంతో ఏ క్షణమైనా సైనిక చర్య ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: Nigeria: నైజీరియాలో రోడ్డు ప్రమాదం..21 మంది అథ్లెట్లు మృతి

#ChinaTaiwanTensions #ChinaThreat #Geopolitics #IndoPacificSecurity #TaiwanIssue Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.