📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: కాల్పుల ఉల్లంఘన అనంతరం పాక్ కు చైనా మద్దతు

Author Icon By Anusha
Updated: May 11, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా, పాకిస్థాన్ మధ్య శనివారం సాయంత్రం (మే 10) కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని గంటల వ్యవధిలోనే నీరుగారిపోయింది. పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టింది. దాయాది కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన విషయం తెలిసిందే. డ్రోన్లు కనిపించడంపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంగ్వీ(Harsh Sanghvi)లు సోషల్ మీడియాలో స్పందించిన కొద్ది నిమిషాల్లోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్‌కు తమ మద్దతును ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఆంతర్యం ఏంటి? అనే చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ‘పాకిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వాతంత్య్రాన్ని రక్షించడంలో బీజింగ్(Beijing) మద్దతుగా ఉంటుంది’ అని ప్రకటించారు. ఈ సంభాషణ అనంతరం, పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్, భారత్ మధ్య మే 12న చర్చలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.

కథనం

ఈ ప్రకటన ప్రకారం,జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ, ప్రాంతీయ పరిస్థితులపై ఇషాక్ దార్ చైనా విదేశాంగ మంత్రికి వివరించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం,వాంగ్ యీ మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ కఠినమైన పరిస్థితుల్లో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని చైనా అభినందిస్తుంది’ అన్నారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించడం కూడా చైనా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం.పాక్ విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం “పాక్‌ అన్నికాలాల్లోనూ వ్యూహాత్మక సహాయ భాగస్వామిగా, బలమైన మిత్రదేశంగా ఉన్న చైనా(China) భవిష్యత్తులోనూ పాకిస్థాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రాన్ని రక్షించడంలో పూర్తిగా మద్దతు ఇస్తుందని’ వాంగ్ యీ హామీ ఇచ్చారు. అంతేగాక, ఇషాక్ దార్ టర్కీ విదేశాంగ మంత్రి హాకన్ ఫిడాన్‌తో కూడా మాట్లాడి, ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితులపై ఆయన కూడా వివరంగా సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

ఉల్లంఘనల

పాక్ కాల్పుల ఉల్లంఘనపై భారత్ కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ల మధ్య కుదిరిన అవగాహనను పాకిస్తాన్ పునరావృతంగా(Repeatedly) ఉల్లంఘిస్తోందని, తక్కువ సమయంలోనే అవగాహనకు తూట్లు పొడిచిందని మండిపడింది .‘ఈ ఉల్లంఘనలపై సాయుధ దళాలు తగిన, గట్టిగా స్పందిస్తున్నాయి. మేము ఈ ఉల్లంఘనలను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నాం. పాకిస్థాన్ బాధ్యతాయుతంగా స్పందించి, పరిస్థితిని తీవ్రతతో ఎదుర్కోవాలని మేము కోరుతున్నాం’ అని పేర్కొంది.

Donald Trump : భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అమెరికా సంచలన ప్రకటన

#CeasefireViolation #ChinaSupportsPakistan #IndiaPakistanTensions #OperationSindoor #WangYiStatement Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.