📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

ఇన్వెస్టర్లను భయపెడుతున్న చైనా కొత్త వైరస్

Author Icon By Vanipushpa
Updated: February 22, 2025 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు 4 ఏళ్ల కిందట చైనా నుంచి ప్రపంచానికి విస్తరించిన కరోనా వైరస్ పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. చైనా నగరం ఊహాన్ నుంచి ప్రపంచ నలుమూలలకు విస్తరించిన వైరస్ ప్రజల ప్రాణాలతో పాటు వారి ఆర్థిక మూలాలను కూడా భారీగా దెబ్బతీసింది. ఈ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మరోసారి ఆందోళనలు మెుదలయ్యాయి.
గబ్బిల కరోనావైరస్‌గా గుర్తింపు
తాజాగా చైనా పరిశోధకుల బృందం HKU5-CoV-2 అనే వైరస్ గబ్బిల కరోనావైరస్‌ను గుర్తించింది. ఇది జంతువుల నుండి మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో వ్యాప్తి చెందే అవకాశం గురించి ఆందోళనలను లేవనెత్తారు. ఈ వైరస్ కొవిడ్-19కి కారణమైన వైరస్ అయిన SARS-CoV-2 లాగా మనుషుల శరీరంలోకి వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. కొత్తగా కనుగొనబడిన వైరస్ మెర్బెకోవైరస్ ఉపజాతిలో భాగమని అధ్యయనంలో వెల్లడైంది.


ఆరోపణలను తోసిపుచ్చారు
గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయం, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో సహా పరిశోధకుల బృందం ఇటీవల మంగళవారం పీర్-రివ్యూడ్ జర్నల్ సెల్‌లో తమ పరిశోధనలను సంబంధించిన వివరాలను పంచుకోవటంతో మరోసారి చైనా వైరస్ భయాలు బయటకు వచ్చాయి. కొవిడ్-19 పరిశోధనలో కీలక వ్యక్తి షి జెంగ్లీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని మహమ్మారికి అనుసంధానిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. షి జెంగ్లీతో పాటు అనేక మంది ఇతర శాస్త్రవేత్తలు వైరస్ సహజంగా ఉద్భవించిందని వాదించారు. కానీ కొవిడ్-19 మహమ్మారి సహజ మూలానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిసిందే.
స్టాక్ మార్కెట్లలో భయాలు
స్టాక్ మార్కెట్లలో భయాలు.. వాస్తవానికి 2019 సమయంలో కరోనా వైరల్ వ్యాప్తితో ప్రపంచం ఒక్కసారిగా స్థంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ షేర్లను విక్రయించటానికి ప్రజలు ఇష్టపడటంతో అనేక విలువైన కంపెనీల షేర్లు సైతం భారీ పతనాన్ని కొనసాగించాయి. వందల లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. చాలా కంపెనీలు ఈ కాలంలో తమ వ్యాపారాలను మూసివేయటంతో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల నుంచి కనుమరుగైన పరిస్థితుల గురించి మనకు తెలిసిందే.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu China is the new virus Google News in Telugu Latest News in Telugu Paper Telugu News scaring investors Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.