📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

భారీ సైనిక స్థావరాన్ని నిర్మిస్తున్న చైనా!

Author Icon By Vanipushpa
Updated: February 5, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా.. మన పొరుగున ఉన్న అతిపెద్ద దేశం. ఆర్థికంగా, సైనికశక్తి పరంగా ఎలా చూసుకున్నా.. చైనా చాలా శక్తివంతమైన దేశమనే చెప్పాలి. అలాంటి చైనాకు అమెరికా అంటే గిట్టదు. అమెరికానే కాదు.. అమెరికాతో సన్నిహితంగా ఉండే ఏ దేశంతోనైనా చైనా కయ్యానికి కాలు దువ్వుతుంది. అలాంటి దేశానికి ఒక కల ఉంది. అదే ప్రపంచానికి పెద్ద అన్నగా ఎదగడం. కానీ, అది అమెరికా ఉన్నన్ని రోజులు సాధ్యపడదు. అందుకే అమెరికా కంటే చాలా శక్తివంతమైన దేశంగా ఎదగాలని చైనా చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడూ అదే పనిలో ఉంది చైనా. మెున్నటికి మెున్న డీప్ సీక్ పేరుతో ఏఐ చాట్ బాట్‌ను తీసుకొచ్చి అమెరికా కంపెనీలకు చుక్కలు చూపించింది. ఇప్పుడు ఏకంగా పెంటగాన్‌ కంటే 10 రెట్లు పెద్దదైన సైనిక స్థావరాన్ని నిర్మిస్తూ ప్రపంచానికే సవాల్ విసురుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీ సిటీని చైనా నిర్మిస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన నివేదిక.

యూఎస్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కొంతమంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజింగ్‌కు నైరుతి వైపున 30 కిలో మీటర్ల దూరంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంతంలో భారీ బంకర్లను నిర్మిస్తోందని.. శాటిలైట్ చిత్రాలు అందుకు ఆధారాలని వారు చెబుతున్నారు. ఇక్కడ వందల క్రేన్లు 5 చదరపు కిలో మీటర్ల ప్రాంతంలో నిత్యం పనులు చేస్తన్నాయని.. జియో స్పేషియల్ ఏజెన్సీ మాజీ అధికారి ఒకరు అన్నారు. న్యూక్లియర్ దాడులు జరిగినా చైనా లీడర్లకు ఏమి అవ్వకుండా చాలా పటిష్టమైన నిర్మాణాలను చైనా చేపడుతోందని వారు అంటున్నారు. దీనికి బలం చేకూరుస్తూ కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేశారు. చైనా మిలటరీ సిటీ నిర్మాణాన్ని గత కొద్దిరోజులుగా అమెరికా ఇంటెలిజెన్స్ చాలా నిశితంగా పరిశీలిస్తోంది.
చైనా నిర్మిస్తున్న ఈ నిర్మాణం.. మిలటరీ సిటీనే అని చెప్పడానికి అనేక సాక్ష్యాలు బయటికి వచ్చాయి. వాటిలో మెుదటిది ఆ ప్రాంతంలో పెద్దస్థాయిలో నిర్మాణాలు జరుగుతుండటం. భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధం వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధమన్నట్టు చైనా భారీ బంకర్ నిర్మిస్తోంది. ఇది పూర్తయితే తైవాన్‌పై దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా కన్పిస్తోంది. దీనిపై వైట్ హౌస్ ఇప్పటివరకు అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ, పెంటగాన్ అధికారులు ఎప్పటికప్పుడు చైనా మిలటరీ సిటీపై నిఘా వేస్తున్నట్టు తెలుస్తోంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu china Google News in Telugu huge military base Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.