📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: ఎరువుల ఎగుమతులు నిలిపివేసిన చైనా

Author Icon By Vanipushpa
Updated: June 28, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌(India)కు ఇటీవల అరుదైన లోహాల దిగుమతులు ఆపేసి షాకిచ్చింది పొరుగు దేశం చైనా(China). అరుదైన ఎర్త్ మాగ్నెట్(earth magnet)దిగుమతులలపై ఆంక్షలు విధించింది. దీంతో సప్లయ్ చైన్‌కు అంతరాయం కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చైనా ఆంక్షలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను ప్రభావితం చేయనున్నాయి. అయితే తాజాగా చైనా(China) మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలలుగా భారతదేశానికి ప్రత్యేక ఎరువుల దిగుమతులను నిలిపివేసింది చైనా. ఈ ఎరువులు.. పండ్లు, కూరగాయలు, ఇతర పంటల దిగుబడిని పెంచడానికి విరివిగా ఉపయోగిస్తారు.

భారత్‌కు ఎరువుల ఎగుమతులు నిలిపివేసిన చైనా

భారత్‌కు దిగుమతులు నిలిపివేసి..
వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే దేశాల్లో కీలకంగా ఉన్న చైనా.. భారత్‌కు దిగుమతులు నిలిపివేసి.. ఇతర దేశాలకు సరఫరా చేస్తూనే ఉండటం గమనార్హం. భారత్ తన అవసరాల కోసం దాదాపు 80% ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. “గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా చైనా ప్రత్యేక ఎరువుల సరఫరాను భారత్‌కు తగ్గిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం పూర్తిగా నిలిపివేసింది.” అని సోల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (SFIA) అధ్యక్షుడు రాజీబ్ చక్రబర్తి తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు, పాకిస్తాన్‌కు మద్దతు వంటి కారణాల వల్ల డ్రాగన్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భారతదేశంలో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గత ఐదేళ్లలో సరిహద్దు వివాదాలు పెరిగాయి
అయితే చైనా ప్రభుత్వం భారత్‌కు ఎగుమతులను నిలిపివేయడానికి వివిధ విధానాలను ఉపయోగిస్తోంది. “ఫ్యాక్టరీల నుంచి బయటకు వెళ్లే ప్రతి వస్తువును చైనా తనిఖీ చేస్తుంది. భారత్‌కు పంపాల్సిన సరుకులను తనిఖీ చేయడం లేదు. ఎటువంటి బహిరంగ నిషేధం విధించకుండానే ఎగుమతులను నిరోధించడానికి వివిధ విధానాలను ఉపయోగిస్తున్నారు” అని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులు తెలిపారు.
భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుమతి తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య గత ఐదేళ్లలో సరిహద్దు వివాదాలు పెరిగాయి. ఇక.. పాకిస్తాన్‌కు డ్రాగన్ మద్దతు ఇవ్వడం కూడా ఉద్రిక్తతలను పెంచింది.

ఎందుకోసం ఈ ఎరువులు అవసరం
అధిక-నాణ్యత గల పంటల పెరుగుదల దశల్లో వాటి ప్రత్యేక అవసరాలను తీర్చడం, దిగుబడిని పెంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. కంట్రోల్డ్ లిలీజ్ మెకానిజంల ద్వారా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. పర్యావరణ సంబంధిత ఆందోళనలకు కూడా పరిష్కారంగా ఉంటాయి.
భారతదేశం సాధారణంగా జూన్-డిసెంబర్ కాలంలో 150,000 నుంచి 160,000 టన్నుల ప్రత్యేక ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం చైనా ఎగుమతులను నిలిపివేయడంతో పత్యామ్నాయ మార్గాల్లో దిగుమతి చేసుకోవాలి. ఇక భారత్ ముందున్న దారి.. పశ్చిమ ఆసియా లేదా యూరప్ నుంచి ఎరువులు దిగుమతి చేసుకోవడం. స్థానికంగా ఈ రకమైన ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు అందించడం.

Read Also: Trump: ఇరాన్‌పై ట్రంప్ ప్రశంసల జల్లులు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu China India border tension China India exports China India military standoff China India strategy China India trade China-India Relations Galwan Valley Google News in Telugu India China conflict India China current affairs India China diplomacy India China economy India China imports India China latest updates India China news India China talks India China war possibility India vs China India-China border Indo-China relations LAC India China Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.