📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: దలైలామా వారసుడికి మా ఆమోదం ఉండాలంటున్న చైనా

Author Icon By Vanipushpa
Updated: July 3, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వారసుడిని నిర్ణయించే అధికారం తనకు మాత్రమే ఉందంటూ బౌద్ధ మత గురువు దలైలామ(Dalai Lama) చేసిన వ్యాఖ్యలపై చైనా(China) స్పందించింది. దలైలామా(Dalai Lama) వారసుడికి కచ్చితంగా తమ ఆమోదముద్ర ఉండాల్సిందేనని చైనా(China) పేర్కొంది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి
‘వారసుడి ఎంపిక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి. 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం ప్రారంభించిన ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని అనుసరించాల్సిందేనని మావో నింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపికైనప్పటికీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అర్న్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2007లో గోల్డెన్ అర్న్ విధానాన్ని చైనా చట్టబద్ధం చేసింది. దీనిలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఉంటుంది’ అని మావోనింగ్ అన్నారు. అయితే, మావోనింగ్ దలైలామా వ్యాఖ్యలకు ఇచ్చిన స్పందన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ట్రాన్స్‌క్రిప్ట్‌లో లేకపోవడం గమనార్హం.

China: దలైలామా వారసుడికి మా ఆమోదం ఉండాలంటున్న చైనా

వారసుల ఎంపిక ప్రక్రియ కూడా చైనా చట్టాలు ఆధారంగా జరగాలి
లివింగ్ బుద్ధా పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాలకు పైగా కొనసాగుతోందని భారత్​లోని చైనా రాయబారి సూఫెహాంగ్ అన్నారు. ‘దలైలామ కూడా మతపరమైన ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఎంపికయ్యారు. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తోంది.
సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన దలైలామా
15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, దానిని నిర్వహించే అధికారం గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని సోషల్‌ మీడియాలో దలైలామా పోస్టు పెట్టారు. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. దీనితో తన వారసుడి ఎంపిక గురించి దలైలామా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. తాను మరణించిన తర్వాతే తన వారసుడు వస్తారని స్పష్టం చేశారు. 2015లో ఈ ట్రస్ట్‌ను దలైలామా ఏర్పాటు చేశారు. 2011 సెప్టెంబర్‌ 24నే తాను టిబెట్‌ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు.

Read Also: Donald Trump : ఎలాన్ మస్క్‌ను ‘‘డోజ్‌’ రాకాసి తినేస్తుంది!’: ట్రంప్‌

#telugu News Ap News in Telugu beijing dalai lama control Breaking News in Telugu china on dalai lama successor china tibet policy chinese interference tibetan affairs dalai lama next successor dalai lama succession issue Google News in Telugu india tibet china relations Latest News in Telugu panchen lama china Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today tibet china conflict tibetan buddhism politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.