📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

IPhone: భారత్‌‌లో ఐఫోన్‌లు తయారు కాకుండా చైనా అడ్డుకట్ట

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని, ఐఫోన్లు ఇండియాలోనే తయారవుతాయనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే చైనా మళ్ళీ తన తెలివితేటలను ప్రదర్శించింది. ఆదిలోనే భారతదేశంలో జరగాల్సిన ఐఫోన్ తయారీకి డ్రాగన్ కంట్రీ అడ్డుకట్ట వేసింది. ఆపిల్ ప్రధాన తయారీదారు అయిన ఫాక్స్‌కాన్…భారతదేశంలోని దాని తయారీ కేంద్రాల నుండి 300 మందికి పైగా చైనీస్ నిపుణులు, ఇంజనీర్లను స్వదేశానికి రావాలని ఆదేశాలు ఇచ్చింది. భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తికి కంపెనీ సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
టెక్ నిపుణులు స్వదేశానికి రప్పించుకున్న చైనా
భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచాలనే ఆపిల్ లక్ష్యం చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించడం వల్ల ప్రభావితమవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజనీర్లను చైనాకు పంపడం ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రభావితం చేసే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఈ పరిస్థితులు ఇలా ఉంటే భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి చైనా నుండి కీలకమైన పరికరాలను ఆపిల్ కంపెనీ దిగుమతి చేసుకోవాలి.

IPhone: భారత్‌‌లో ఐఫోన్‌లు తయారు కాకుండా చైనా అడ్డుకట్ట

ఐఫోన్ ఉత్పత్తిని అడుకోవడానికి చైనా వేసిన ఎత్తుగడ
అయితే చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పరికరాలను చైనా నుండి బయటకు వెళ్లకుండా నిరోధించింది. వాటిని పోర్టులలో నిలిపివేసింది. ఈ రెండు కారణాలు భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని అడుకోవడానికి చైనా వేసిన ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఆపిల్ యొక్క అతిపెద్ద కాంట్రాక్టర్. ఈ కంపెనీకి తమిళనాడులోనే కాకుండా బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఫాక్స్‌కాన్ ఇటీవల భారతదేశంలో 1,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది. దీనితో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 40,000కి చేరుకుంది. చైనా ప్రభుత్వం తన సాంకేతిక నిపుణులను విదేశాల్లోని పోటీ తయారీ కేంద్రాలకు వలస వెళ్లడాన్ని నిశ్శబ్దంగా నియంత్రిస్తోంది.

2026 నాటికి భారతదేశంలో అదనపు యుఎస్-బౌండ్ ఐఫోన్‌లను తయారు
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ చైనా నిపుణుల సామర్ధ్యాలను పదే పదే ప్రశంసిస్తూ వస్తున్నారు. వారు ఖర్చు పరంగానే కాకుండా నాణ్యమైన ఉత్పత్తికి అవసరమైన ఖచ్చితత్వంలో అనుభవజ్ఞులని వివరించారు. ఈ విషయంలో చైనా నిపుణులను వెనక్కి పిలిపించాలనే నిర్ణయం భారతదేశంలో ఫాక్స్‌కాన్ నియమించిన సాంకేతిక నిపుణుల కొరతకు దారితీస్తుంది. భారతదేశంలో నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఫోన్ ప్లాంట్లు ప్రపంచ ఉత్పత్తిలో ఐదవ వంతు వాటాను కలిగి ఉన్నాయి.

అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు

ఇక ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలు తమిళనాడులో తమ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేశాయి. ఫాక్స్‌కాన్ చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లోని తన ప్లాంట్‌లో ఐఫోన్‌లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య బహుళజాతి కంపెనీలు తమ తయారీ స్థావరాలను భారతదేశంతో పాటుగా దక్షిణాసియా దేశాలకు మారుస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక పరిజ్ఞానాలకు చైనా ఆధిపత్యాన్ని నిరోధించడం ఈ విస్తరణ ప్రయత్నాలకు తీవ్రమైన సవాళ్లను ఎత్తి చూపుతోంది.

Read Also: hindi.vaartha.com

Read Also:India: దలైలామా వారసుడిపై చైనా జోక్యం – భారత్‌ ఖండన

#telugu News Ap News in Telugu Apple factory India Apple Foxconn India Apple India plans Breaking News in Telugu China blocks Apple production China India tech rivalry China interference Apple Google News in Telugu India China tech tension iPhone assembly India iPhone manufacturing India iPhone supply chain Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.