📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన చైనా ?

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 8:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలో మరోసారి శాంతి స్థిరతకు గండిపడే పరిస్థితి నెలకొంటున్నది.ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వివాదంలో తలదూరుస్తూ అమెరికా ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. తమతో అణు ఒప్పందం చేసుకోవాలని చాలా కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ (Iran) పై ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. కానీ, ఇరాన్‌ ఈ విషయంలో స్వతంత్రంగానే వ్యవహరిస్తామంటూ, అమెరికా ఆఫర్‌ను తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ అణు బాంబులు తయారు చేస్తుందని, భవిష్యత్తులో ఇది తమకు ముప్పుగా మారొచ్చని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తూ ఇరాన్‌పై దాడికి పాల్పడింది.

తీవ్రంగా ఖండించింది

దీంతో ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై ఊహించని విధంగా ప్రతిదాడితో విరుచుకుపడింది. ఇరాన్‌ నుంచి ఇంతటి ప్రతిఘటన ఊహించని ఇజ్రాయెల్‌ బెంబేలెత్తిపోయింది. వెంటనే అమెరికా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వివాదంలో జోక్యం చేసుకోవాలా వద్దా అని రెండు వారాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ట్రంప్‌(Donald Trump) ఆ మాట చెప్పిన 48 గంటల్లోనే ఇరాన్‌పై దాడి చేశారు. ఈ దాడిపై తాజాగా చైనా స్పందించింది. ఇరాన్‌పై అమెరికా చేసిన దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది ఖచ్చితంగా యూఎన్‌ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ పేర్కొంది.

China: ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన చైనా ?

ఇరాన్‌కు మద్దతుగా

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా చైనా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరినట్లు అయింది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనా (China) మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తునే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం కారణంగా రెండు శక్తివంతమైన దేశాలు చెరో దేశానికి మద్దతుగా నిలవడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం మరింత ముదిరి మూడో ప్రపంచ యుద్ధానికి (Third World War)దారి తీసే ప్రమాదం ఉందనే భయం వ్యక్తం అవుతోంది.ఈ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచస్థాయిలో ఆర్థిక, మానవతా ప్రభావాలు తీవ్రంగా ఉంటాయి. పెట్రోల్ ధరలు, స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ రవాణా రంగాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, భారత్, రష్యా వంటి దేశాలు ఈ ఉద్రిక్తతలపై నిశితంగా గమనిస్తున్నాయి. ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరగకూడదన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

Read Also: Marco Rubio: ఇరాన్ శాంతిని కోరుకుంటే అందుకు సిద్ధం: రూబియో

#ChinaSupportsIran #GlobalGeopolitics #IsraelIranConflict #MiddleEastTensions Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.