📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

America: యూఎస్ లో పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు

Author Icon By Vanipushpa
Updated: April 3, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఇద్దరు బయలాజికల్ సెక్సెస్- మేల్ అండ్ ఫిమేల్‌ను మాత్రమే గుర్తించేలా తన విధానాలను సవరించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ- ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సిటిజన్‌‌షిప్, ఇమ్మిగ్రేషన్ విధానాలను అప్‌డేట్ చేసినట్లు వెల్లడించింది. మొన్నటివరకు ఉన్న థర్డ్ జెండర్‌ ఆప్షన్‌ను తొలగించినట్లు వెల్లడించింది. థర్డ్ జెండర్‌ను అధికారికంగా గుర్తిస్తూ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆటోమేటిక్‌గా రద్దయినట్టవుతుంది.

ఇమ్మిగ్రేషన విధానం జాతీయ భద్రత అవకాశం
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీకి డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నారని, ఈ క్రమంలోనే తాజా సవరణలు చోటు చేసుకున్నాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ సెక్రెటరీ ట్రైసియా మెక్‌లాఘ్లిన్ తెలిపారు. మేల్, ఫిమేల్‌ను మాత్రమే ఇక గుర్తిస్తామని అన్నారు. ఈ విషయంలో తాము సింపుల్ బయాలాజికల్ రియాలిటీ ఫార్ములాను అనుసరిస్తోన్నామని చెప్పారు. ఇమ్మిగ్రేషన విధానం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, ఇందులో అప్రమత్తంగా ఉండక తప్పదని పేర్కొన్నారు. ఎలాంటి చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదనేది తమ విధానపర నిర్ణయమని వ్యాఖ్యానించారు.
మెరుగైన జీవన ప్రమాణాల కోసం
మహిళలు, పిల్లల ప్రయోజనాలు, వారికి భద్రత కల్పించడం, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల మెరుగుపర్చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ట్రైసియా మెక్‌లాఘ్లిన్ అన్నారు. భద్రత వ్యవస్థ తమ దేశ పౌరులకు హాని కలిగించేలా ఉండే ఏ అంశాన్నయినా తీవ్రంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు, వాటి అనుబంధ డాక్యుమెంట్లల్లో మేల్, ఫిమేల్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. థర్డ్ జెండర్‌ ఆప్షన్‌ను తొలగించింది. దీన్ని నిర్ధారించడానికి జనన ధృవీకరణ పత్రాలను ప్రామాణికంగా తీసుకుంటామని మెక్‌లాఘ్లిన్ వివరించారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Changes in citizenship and immigration Google News in Telugu in the US Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.