📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad Plane Crash:కెప్టెన్ సుమీత్‌ మరణంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

Author Icon By Anusha
Updated: June 13, 2025 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యావత్ సమాజాన్ని

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అనేక మందిని అనాథలను చేసింది. ప్రమాదం సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు సహా 10 మంది సిబ్బంది ఉండగా ఇందులో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారంతా చనిపోయారు.అయితే మృతుల్లోనే ఎయిర్ ఇండియా కెప్టెన్ సుమిత్ (Captain Sumit) ఉండగా అతడి కథ ఇప్పుడు యావత్ సమాజాన్ని కన్నీళ్లు పెట్టిప్సోతంది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తండ్రికి ఇటీవలే ఓ మాట ఇచ్చారు. పైలట్ ఉద్యోగం మానేసి వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను నాన్నా అని చెప్పారు.

ఫస్ట్ ఆఫీసర్

కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో మృతి చెంది, వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చారు.కెప్టెన్ సుమిత్ సభర్వాల్‌కు 8,200 గంటల సుదీర్ఘ పైలెట్ అనుభవం ఉంది. ఆయనతో పాటు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ (Clive Kunder) కూడా 1,100 గంటల అనుభవంతో కలిపి, మొత్తం 9,300 గంటల అనుభవం ఉన్న పైలెట్లు ఈ విమానాన్ని నడిపారు. అయితే గురువారం రోజు మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన ఈ విమానం కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.

ఆరోగ్యం క్షీణించడం

ప్రమాదానికి ముందు కెప్టెన్ సభర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు “మేడే” కాల్ చేసి, విమానం అదుపు తప్పినట్లు సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత కాసేపట్లోనే విమానం కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఒక్క వ్యక్తి తప్ప విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు.కెప్టెన్ సుమీత్‌కు తన ఉద్యోగం అంటే చాలా ఇష్టం. కానీ తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం, అందులోనూ ఆయన ఒంటరిగా ఉండడంతో ఉద్యోగం కంటే కన్నతండ్రికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. చివరి దశలోకి చేరి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం తనకెంతో ఇష్టమైన పైలెట్ ఉద్యోగాన్ని (Pilot job) కూడా వదులుకోవడానికి సిద్ధం అయ్యారు.

పరిస్థితి వచ్చిందంటూ

అయితే ఇదే విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పారు. త్వరలోనే పైలెట్ ఉద్యోగం మానేసి వచ్చేస్తాను, మిమ్మల్ని చూసుకుంటాను నాన్న అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి పొంగిపోయాడు. కుమారుడికి తనపై ఉన్న ప్రేమను చూసి లోలోపలే మురిసిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా ముంబైలోని పోవై ప్రాంతం (Powai area) లో ఒంటరిగా ఉంటున్న తండ్రి తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడు ప్రాణాలు కోల్పోగా తానే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే కెప్టెన్ సుమిత్ తండ్రి కూడా గతంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో విధులు నిర్వహించారు. చాలా రోజుల క్రితమే పదవీ విరమణ కూడా పొందారు.

Read Also: plane crash : డిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్న గుజరాత్‌ ఏటీఎస్‌

#AviationHero #CaptainSumit #HeartbreakingFarewell #TragicLoss Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.