📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

PM Mark Carney: ఎన్నికల్లో గెలిచిన ఆనందంతో డాన్స్ చేసిన కెనడా ప్రధాని

Author Icon By Vanipushpa
Updated: April 30, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకే ఆధిక్యం లభించింది. ఇలా ఈ సారి కూడా ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీయే ఆ పదవిలో కొనసాగబోతున్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలంతా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మార్క్ కార్నీ సైతం మంగళవారం రోజు సాయంత్రం ఓ పార్టీకి వెళ్లారు. అక్కడే “టైమ్ టు విన్” అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. ఎరుపు రంగు హుడీ ధరించి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూనే.. చూపరుల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు.

అధికార లిబరల్స్ 168 సీట్లు
కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 సీట్లు ఉండగా.. అధికారం పొందాలంటే 172 సీట్లు గెలుచుకోవాలి. అయితే ఓట్ల లెక్కింపు నిలిపివేసే నాటికి అధికార లిబరల్స్ 168 సీట్లలో ఉన్నారు. పూర్తి మెజార్టీకి కేవలం నాలుగు స్థానాలు ఉండగా.. పియర్ పోయిలివ్రే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లతో వారిని అనుసరించింది. ముఖ్యంగా ఖలిస్థాన్ అనకూలుడు అయిన భారత సంతతి నేత జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ కేవలం 4-7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఆయన ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా చేశారు.


“టైమ్ టు విన్” పాటకు కార్నీనృత్యం
ఇలా కార్నీ పార్టీ గెలవడంతో.. లిబరల్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. రాప్-రాక్ బ్యాండ్ డౌన్ విత్ వెబ్‌స్టర్ (డీడబ్ల్యూడబ్ల్యూ)లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో డీడబ్ల్యూడబ్ల్యూ ఎరుపు రంగు హుడీ ధరించిన కార్నీ “టైమ్ టు విన్” పాటకు అక్కడి వారితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. పాట పాడుతూ మరీ అద్భుతంగా నృత్యం చేయగా.. అక్కడున్న వారంతా తెగ సంబుర పడిపోయారు.

బాగా డ్యాన్స్ చేశారు, కంగ్రాట్స్ అంటూ కామెంట్లు

ఆయనతో కలిసి డ్యాన్స్ వేసేందుకు తెగ ఆసక్తి కనబర్చారు. మరికొందరు అయితే ఆయన డ్యాన్స్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా కెనడా ప్రధాని మార్క్ కార్నీ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు, కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అభినందనలు తెలిపారు. త్వరలోనే ట్రంప్.. కెనడా ప్రధానితో వ్యక్తిగతంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలోనే ఇరుదేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్లు ఇటీవలే ఓ ప్రకటన విడుదల అయింది. ఈ ఎన్నికల ఫలితాలు, కెనడా-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మార్క్ కార్నీని అభినందించారు. వారు త్వరలోనే వ్యక్తిగతంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు, ఈ సమావేశంలో ఇరుదేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. మార్క్ కార్నీ నాయకత్వంలో, కెనడా తన స్వతంత్రతను కాపాడుకునేందుకు కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Read Also: Pak: పాకిస్థాన్‌లో మండుతున్న ఎండలు ఏకంగా 50 డిగ్రీలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Canadian Prime Minister dances with joy Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.