Donald Trump: ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక

Read Time:  1 min
ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక
ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక
FONT SIZE
GET APP

కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెకాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదని… పొరపాటున కూడా ఆ ఆలోచన చేయవద్దని చెప్పారు. కెనడా నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తాం

ట్రంప్ కెనడాను అమెరికాలో విలీనం చేయాలని సూచించిన నేపథ్యంలో, కార్నీ ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించారు.కెనడాపై అమెరికా గౌరవం చూపించాలని… అంతవరకు అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగిస్తామని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడా సార్వభౌమాధికారం పట్ల గౌరవం చూపితేనే తాను ట్రంప్ ను కలుస్తానని చెప్పారు. మరోవైపు కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ తెలిపిన వివరాల ప్రకారం… కార్నీ-ట్రంప్ మధ్య చర్చలు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

కెనడా-అమెరికా సంబంధాలు

కెనడా-అమెరికా మధ్య వాణిజ్య, భద్రతా, సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు దేశాలు తమ స్వతంత్రతను కాపాడుకోవడంలో నిబద్ధంగా ఉన్నాయి. కెనడా ప్రజలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనే అభిలాషతో ఉన్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.