📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Canada: విదేశీయులకు శాశ్వత నివాసంపై కెనడా కీలక నిర్ణయం

Author Icon By Vanipushpa
Updated: July 1, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా(Canada) ప్రభుత్వం విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన శరణార్థులు, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆర్థిక వలసదారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక నిపుణులు, ఫ్రెంచ్(French) మాట్లాడేవారికి దీని వల్ల అధిక ప్రాధాన్యత లభిస్తుంది. తాత్కాలిక వీసాల జారీలో భారతీయు(Indians)లు అధికంగా ఉండటం గమనార్హం. ఈ మార్పుల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.
విదేశాల నుంచి ప్రతిభావంతులు, ఆర్థిక వలసదారుల (economic immigrants) శాశ్వత నివాసానికి సంబంధించి (Permanent Residency) కొత్త విధానాన్ని కెనడా త్వరలోనే అమలు చేయనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎకనామిక్ మొబిలిటీ పాత్‌వేస్ పైలట్ (EMPP)లో ఈ మేరకు మార్పులు చేపడుతోంది. ఈ కొత్త విధానం ద్వారా నైపుణ్యం కలిగిన శరణార్థులు, విదేశీ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం , ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు.

Canada: విదేశీయులకు శాశ్వత నివాసంపై కెనడా కీలక నిర్ణయం

2018లో ఈఎంపీపీ విధానాన్ని కెనడా ప్రారంభించింది
డిసెంబర్ 31తో ముగియబోతున్న ఈఎంపీపీకి ముందు దీనిని ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
ఈఎంపీపీ విధానాన్ని 2018లో కెనడా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా ఈ ఏడాది మార్చి వరకూ సుమారు 970 మంది శరణార్థులు కెనడాలో శాశ్వత నివాసం పొందారు. ఇది శరణార్థులకు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా ఆర్థికంగా దేశానికి తోడ్పాటు అందించేవారిగా వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్. రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) విధానంలో భాగంగా విదేశీ కార్మికులు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో పని చేసే వారికి, విద్యార్థులకోసం ఉద్దేశించిన పీజీ వర్క్ పర్మిట్ (PGWP), భాగస్వామి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానంలోనూ మార్పులు చేయనున్నారు. విదేశీ కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థుల జీవిత భాగస్వాములకు కూడా ఇది వర్తిస్తుంది.
భారతీయులే అధికం
కాగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొత్తం 834,010 తాత్కాలిక వీసా దరఖాస్తులను కెనడా ఆమోదించగా.. ఇందులో భారతీయులే అధికం (3,82,055 (45.8%). నూతన శాశ్వత నివాస విధానం, వీసా నిబంధనల్లో మార్పుల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ మార్పులు అనేక కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ప్రాధాన్య జాబితాలో హెల్త్‌కేర్, టెక్ వర్కర్లకు అవకాశాలు పెరుగుతాయి. తాత్కాలిక వీసా ఆమోదంలో భారతీయులు మొదటి స్థానంలో ఉండటం, వారి వలసదారుల్లో వారి ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడా పర్యటనతో ఇరు దేశాల మధ్య దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు, వివాదాలకు తెరపడిన సంగతి తెలిసిందే.

Read Also: Xi Jinping: చైనా సైన్యంలో తిరుగుబాటు..సీనియర్ అధికారుల తొలగింపు?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Canada Citizenship News Canada for Foreign Nationals Canada Immigration Changes Canada Immigration Policy Canada Immigration System Canada Immigration Update Canada New Immigration Decision Canada Permanent Residency Canada PR Process Canada PR Rules 2025 Canada Visa News Canadian Government Announcement Express Entry Canada Foreigners in Canada Google News in Telugu Latest News in Telugu Paper Telugu News PR Eligibility Canada Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.